• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కుక్కని సన్మానించడం...

కుక్కని సన్మానించడం గర్వంగా ఉంది : ట్రంప్ !

By - Tupaki Desk
Update: 2019-11-26 07:52 GMT
ఇస్లామిక్‌ స్టేట్ ఉగ్రవాద సంస్థ అగ్ర నాయకుడు అబు బకర్‌ ఆల్‌ బగ్దాదీ చేసిన ఘోరాలు అన్ని ఇన్ని కావు. నరమేధమే లక్ష్యంగా పనిచేసిన ఐసిస్ అగ్ర నాయకుడిని గత కొన్ని రోజులముందు అమెరికా సైన్యం ఎంతో చాకచక్యంగా మట్టుబెట్టిన విషయం తెలిసిందే. పక్కా ప్రణాళికతో బగ్దాదీ స్థావరాన్ని ముట్టడించిన అమెరికా దళం .. తప్పించుకోవడానికి ఉన్న అన్ని దారులని మూసేయడంతో తనకి తానుగా బాంబు తో పేల్చుకొని చనిపోయాడు. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో అమెరికా సైనికులతో పాటుగా ..ఒక కుక్క కూడా కీలక పాత్ర వహించింది.

అసలు ఒక రకంగా బగ్దాదీ కుక్క చావు చావడానికి కూడా కుక్కనే కారణం. సొరంగంలో దాక్కున్న బాగ్దాదీ ని కుక్క వెంబడించడం తో ఆ కుక్క నుండి ఇక  తప్పించుకోలేనని నిర్ధారణకి వచ్చిన బాగ్దాదీ ఆ సొరంగంలోనే బాంబ్ పేల్చుకొని చనిపోయాడు. బాగ్దాదీ చావుకి కారణమైన ఆ కుక్క పేరు .. కోనన్. పారిపోతున్న ఉగ్రవాదులను వేటాడిన కోనన్,  బాగ్దాదీ మరణానికి కారణమైంది. దీనితో కోనన్ ఒక్కసారిగా హీరోగా మారిపోయింది.   ప్రపంచ దేశాలను గడగడలాడించిన బాగ్దాదీని అంతం చేసిన నువ్వు కుక్క కాదు హీరో అని పలుదేశాల అధినేతలు , ప్రజలు ఆ కొనన్ పై ప్రశంసలు కురిపించారు.

తాజాగా కోనన్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్మానించారు. వైట్ హౌస్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత రోజ్ గార్డెన్ వేడుకలో పాల్గొన్న అయన  కోనన్ పై ప్రశంసల వర్షం కురిపించారు ట్రంప్. 'ఇది మెరుపు దాడి. అల్-బాగ్దాదీ చచ్చాడు. కోనన్ ను సన్మానించాము. పతకం ఇచ్చాము. కోనన్ చాలా ప్రత్యేకమైన కుక్క. సో బ్రిలియంట్, సో స్మార్ట్' అని ట్రంప్ ప్రశంసించారు. అలాగే ఈ కొనన్ కి నేను సన్మానం చేయడం గర్వంగా ఉంది అంటూ చెప్పారు. ఆ ఆపరేషన్ లో పాల్గొన్న కొనన్ కి కూడా కొన్ని గాయాలైయ్యాయి. రహస్య సొరంగంలో బాగ్దాదీ తనను తాను పేల్చేసుకోవడంతో , ఆ సమయంలో దగ్గర్లో ఉన్న కోనన్ గాయపడింది. కానీ , ఆ గాయాల నుండి కొనన్ చాలా త్వరగా కోలుకుంది. కోనన్ బెల్జియన్‌ మలినోయిస్‌ జాతికి చెందిన కుక్క.
Tags:    
  • Donald Trump 
  • Al Baghdadi 
  • Malinois 
  • Us Military 
  • Abu Bakr 
  • White House 
  • Belgian Malinois 

Similar News

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

Copyright @2026

Powered by Blink CMS