మద్య నిషేధం ఎత్తివేయాలని కోర్టుకెక్కిన మందుబాబులు.. ఏంటా కేసు?

Update: 2021-08-26 12:30 GMT
70 సంవత్సరాలుగా అక్కడ మద్యం అమ్మడం.. తాగడం.. చట్టవిరుద్ధం. కానీ మద్యం తాగడం మా ప్రాథమిక హక్కుగా పరిగణించాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ప్రభుత్వం మాత్రం నిషేధానికి అనుకూలంగా వాదనలు వినిపించింది. కానీ ప్రభుత్వ వాదనలను హైకోర్టు తిరస్కరించింది. ఈ సమస్యపై తుది విచారణ కోసం మరో రోజుకు వాయిదా వేసింది. కానీ ప్రభుత్వం మాత్రం సుప్రీం కోర్టులో అప్పీల్ చేసేందుకు రెడీ అవుతోంది. 70 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మద్యం అంటే తెలియని రాష్ట్రం ఏది..? మద్యం తాగడాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించాలని కోర్టెకెళ్లింది ఎక్కడ...?

మనదేశంలోని గుజరాత్ రాష్ట్రంతో పాటు బీహార్, లక్షద్వీప్, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలలో మద్య నిషేధం అమలులో ఉంది. ఏడు దశాబ్దాలుగా ఇక్కడి వారికి మద్యం అంటే ఏంటో తెలియదు. అయితే ఇఫ్పుడు మద్యం తాగడం గోప్యతా హక్కు కింద ప్రాథమిక హక్కుగా గుర్తించాలని గుజరాత్ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ప్రభుత్వం మాత్రం నిషేధానికి అనుకూలంగా వాధించడంతో హైకోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ చేయనున్నట్లు సిద్ధమవుతోంది.

1949 గుజరాత్ మద్య నిషేధ చట్టం ప్రకారం రాష్ట్రంలో మద్యాపానంపై నిషేధాన్ని విధించారు. అయితే మద్యపాన నిషేధాన్ని సవాల్ చేస్తూ గుజరాత్ కోర్టులో వేసిన పిటిషన్లపై విచారించవచ్చని కోర్టు తెలిపింది. పిటిషనర్లు మద్యపాన నిషేధ చట్టం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఇంట్లో కూర్చొని సేవించే హక్కుని కోల్పోతుందని, అది గోప్యతా హక్కును ఉల్లంఘించడమేనని తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 1951 చట్టం ప్రకారం మద్యపాన నిషేధ చట్టాన్ని సుప్రీం కోర్టు సమర్థించిందని తెలిపింది. దీనిని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేస్తే వాటిని విచారించాల్సిన అవసరం లేదన్నారు.

2017లో సుప్రీం కోర్టు సుప్రీం కోర్టుకు చెందిన 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం సొంత ఇంట్లో కూర్చొని మద్యం తాగే హక్కు ఇవ్వొచ్చని తెలిపినట్లు పిటిషనర్లు తెలిపారు. 1949లోని నిబంధనలపై బాంబే ప్రొహిబిషన్ యాక్ట్ 1951లో సుప్రీం కోర్టు తీర్పనిచచింది. ఆ సమయంలో సెక్షన్ 12, 13 ప్రకారం మద్యం తయారు చేయడం, అమ్మడం నిషేధం అని చెబుతుంది. అయితే ఆ సమయంలో బొంబాయి, గుజరాత్ కలిసి ఒకే రాష్ట్రంగా ఉండేది. గుజరాత్ విడిపోయిన తరువాత 1960లో ఈ నిషేధ చట్టాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది.

2017 నుంచి గోప్యతా హక్కుపై సుప్రీం కోర్టు ఆదేశించిన తరువాత నిషేధ చట్టంపై పిటిషన్లు వేస్తున్నారు. 2018, 2019 సంవత్సరాల్లో మద్యనిషేధంపై వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, సమాజాజిక వేత్తలు పిటిషన్లు దాఖలు చేశారు. 2016 నుంచి బీహార్ లో మద్యం అమ్మడం, తాగడాన్ని నిషేధించారు. అయితే 2016 సెప్టెంబర్ 30న తన ఉత్తర్వులో చట్టానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. మద్యం తాగడం ప్రాథమిక హక్కు కాదా..? అన్న ప్రశ్న లెవనెత్తింది. ఆ తరువాత కేరళలో ప్రభుత్వం మద్య దుకాణాల సమస్య హైకోర్టుకు చేరింది. 2017లో ఓ వ్యక్తి మద్యం సేవించే హక్కు గోప్యతా హక్కులో భాగంగా ఉందని హైకోర్టు పేర్కొంది.

2017 ఆగస్టు 24న సుప్రీం కోర్టు తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పులో గోప్యతా ప్రాథకమిక హక్కుగా ప్రకటించింది. ఇది రాజ్యంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం సమర్థించబడిందని తెలిపింది. అయితే అటార్నీ జనరల్ గోప్యత హక్కును మద్యం తాగడానికి, విక్రయించడానికి ప్రాథమిక హక్కుగా చేయలేరని వాదించారు. కానీ సుప్రీం కోర్టు ఏదైనా హక్కును హరిస్తే దాని ఉద్దేశ్యం వెనక మంచిగా ఉండాలని సూచించింది.




Tags:    

Similar News