నాడు టీడీపీ.. నేడు వైసీపీ.. మ్యాట‌ర్ ఇదే... !

నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీ నాయ‌కులు వేర్వేరుగా ఉన్నారు. ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉందిలే అనుకున్నారు.;

Update: 2026-02-09 03:58 GMT

నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీ నాయ‌కులు వేర్వేరుగా ఉన్నారు. ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉందిలే అనుకున్నారు. అంతేకాదు.. ఇప్పుడే ఎందుకు బ‌య‌ట‌కు రావ‌డం అని కూడా భావించారు. ఇదేస‌మ‌యం లో మ‌రికొంద‌రు నాయ‌కులు త‌మ వ్య‌క్తిగ‌త ఇమేజ్ పెరుగుతుందిలే.. అది చాలు అనుకున్నారు. అందు కే.. గ‌త 19 మాసాల్లో వైసీపీ త‌ర‌ఫున అనేక ఉద్య‌మాలు.. నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చినా.. పెద్ద‌గా ఎవ‌రూ స్పందించ‌లేదు. అలాగ‌ని గాలికి కూడా వ‌దిలేయ‌లేదు.

ఏదో మొక్కుబ‌డిగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను కూడా మొక్కుబ‌డిగా పూర్తి చేస్తున్నా రు. దీంతో ప‌దే ప‌దే వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. పార్టీ నాయ‌కుల క‌లివిడిని ప్ర‌స్తావిస్తున్నారు. నాయ‌కులు దూ కుడుగా వుండాల‌ని.. క‌లివిడిగా వ్య‌వ‌హ‌రించాల‌ని కూడా చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. నాయ‌కులు పెద్ద‌గా స్పందించ‌లేదు. కానీ, తాజాగా జ‌రిగిన రెండు ఉదంతాల‌తో వైసీపీలో క‌లివిడి పెరిగింది. నాయ‌కు లు ఏక‌మ‌య్యారు. ఉత్త‌రాంధ్ర నుంచి సీమ వ‌ర‌కు నాయ‌కుల మ‌ధ్య క‌లివిడి పెరిగింది.

అంబ‌టి రాంబాబు, జోగి ర‌మేష్ ల ఇళ్ల‌పై దాడులు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ రెండు అంశాల‌ను కూడా వైసీపీ నాయ‌కులు సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. కాపు, బీసీ సామాజిక వ‌ర్గాలనుఏకం చేయ‌డంతో పాటు.. త‌మ పార్టీ వాయిస్‌ను కూడా బ‌లంగా వినిపించేందుకు ఈ రెండు అంశాల‌ను కూడా నాయ‌కులు ప్ర‌ధానంగా భుజాన వేసుకున్నారు. గ‌తంలో జ‌రిగిన ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. అప్ప‌ట్లో కూడా.. 2019-21 మ‌ధ్య టీడీపీలోనూ ఇలాంటి నైరాశ్య‌మే నెల‌కొంది.

కానీ, నందిగామ‌లో చంద్ర‌బాబుపై రాళ్లు వేయ‌డం.. పార్టీ కార్యాల‌యంపై దాడి చేయ‌డం.. అప్ప‌టి చంద్ర బాబు ఇంటిపై దాడి చేసిన నేప‌థ్యంలో నాయ‌కుల మ‌ధ్య క‌లివిడి పెరిగింది. అప్ప‌టి వ‌ర‌కు అనేక మీటిం గులు పెట్టి.. చంద్ర‌బాబు చెప్పినా.. ముందుకు రాని నాయ‌కులు త‌ర్వాత మాత్రం బాబుతోసంబందం లేకుండా వ్య‌క్తిగ‌తంగా పార్టీని ర‌క్షించుకునేందుకు చంద్ర‌బాబును కాపాడుకునేందుకు ముందుకు వ‌చ్చా రు. ఇప్పుడు వైసీపీలో కూడా పెద్ద ఎత్తున ఇదే కూడిక జ‌రుగుతోంది. ఇది ఏమేర‌కు ఆ పార్టీకి మేలు చేస్తుంద‌న్న‌ది ఎన్నిక‌ల వ‌ర‌కు వేచి చూడాలి.

Tags:    

Similar News