మొన్న 40 ఏళ్ల తర్వాత న్యాయం.. నేడు 45 ఏళ్ల తర్వాత శిక్ష!
అవును... సుమారు 40 ఏళ్ల తర్వాత ఓ సంచలన కేసులో ఇటీవల తీర్పు వెలువడిన సంగతి తెలిల్సిందే. దశాబ్ధాల నిరీక్షణ తర్వాత 100 ఏళ్ల వృద్ధుడికి న్యాయం దక్కింది.;
కేసు పెద్దదా చిన్నదా.. కేసు తీవ్ర ఎక్కువా తక్కువా అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. దాదాపు నాలుగేసి దశాబ్ధాల తర్వాత తీర్పులు వెలువడుతున్న కేసులు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. దోషులకు శిక్ష పడటానికైనా.. నిందితులు నిర్దోషులుగా విడుదలవ్వడానికైనా జీవితంలో సగానిపైగా కాలం పిటిషన్లు కోర్టుల్లో ఉండటం సంచలనంగా మారుతూ సరికొత్త చర్చలకు దారి తీస్తుంది. ఈ క్రమంలో తాజాగా 45 ఏళ్ల తర్వాత శిక్ష పడిన ఓ దొంగతనం కేసు తెరపైకి వచ్చింది.
అవును... సుమారు 40 ఏళ్ల తర్వాత ఓ సంచలన కేసులో ఇటీవల తీర్పు వెలువడిన సంగతి తెలిల్సిందే. దశాబ్ధాల నిరీక్షణ తర్వాత 100 ఏళ్ల వృద్ధుడికి న్యాయం దక్కింది. ఈ మేరకు అతన్ని నిర్దోషిగా తేలుస్తూ అలహాబాద్ హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఈ కేసు 1982 ఆగస్టు 9న జరిగిన ఓ హత్యకు సంబంధించినది కాగా.. ఇందులోని మిగిలిన నిందితుడు ఇప్పటికే మరణించడం గమనార్హం. ఈ క్రమంలో తాజాగా ఓ దొంగతనం కేసులో 45 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తికి తాజాగా శిక్షపడింది.
ఈ తాజా కథ 1980లో ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో... మధ్యప్రదేశ్ లోని బాల్కవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాల్ఖడ్ గ్రామానికి సమీపంలో సలీం సహా ఏడుగురు యువకుల బృందం ఒక రాత్రి పొలాల్లోకి వెళ్లి.. అప్పట్లో సుమారు రు.100 రూపాయల విలువైన గోధుమలను తీసుకెళ్లారని ఆరోపించబడింది. దీనిపై పోలీసులు సలీంతో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేస్తారనే ఆందోళన వారి కుటుంబంలో మొదలయ్యాయని అంటున్నారు. అప్పటికి సలీం వయసు 20 ఏళ్లు!
దీంతో.. సలీం, అతని కుటుంబం వెంటనే గ్రామం వదిలి పొరుగున ఉన్న ధార్ జిల్లాలోకి పారిపోయారు. అక్కడ బాగ్ ప్రాంతంలో తన జీవితాన్ని తిరిగి ప్రారంభించాడు! ఈ క్రమంలో ఓ చిన్న దుకాణం తెరిచి నడుపుతున్నాడు. ఇలా రోజు రోజుకీ వ్యాపారం చిన్న చిన్నగా అభివృద్ధి చెందింది. ప్రశాంతంగా జీవిస్తూ.. దాదాపు 45 ఏళ్లు అయిపోయింది కదా ఇక ఆ కేసు క్లోజ్ అయిపోయి ఉంటుంది.. అంతా మరిచిపోయి ఉంటారని అనుకున్నట్లున్నారు!
కట్ చేస్తే.. నేరం తీవ్రతతో సంబంధం లేకుండా దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించడానికి, పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి మధ్యప్రదేశ్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ లను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పాత ఫైళ్లకు దుమ్ము దులపగా.. దాదాపు 45 ఏళ్ల క్రితం పారిపోయిన సలీం అనే యువకుడు నేడు వృద్ధ దుకాణదారుడిగా ఎదిగి కనిపించాడు. దీంతో.. పోలీసులు అతన్ని అరెస్ట్ చేయగా, కోర్టు అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
మొన్న 40 ఏళ్ల తర్వాత 100 ఏళ్ల వృద్ధుడికి రిలీఫ్ లభించగా.. తాజా కేసులో తప్పు చేసిన వ్యక్తి 45 ఏళ్ల తర్వాత కూడా పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయాడు! పూర్తి వైరుద్యంగా కనిపిస్తున్నట్లున్న ఈ రెండు కేసులూ ఇప్పుడు భారతీయ న్యాయ వ్యవస్థపై మరింత నమ్మకాన్ని కలిగిస్తున్నప్పటికీ.. తప్పు చేసిన వారికి కాస్త ఆలస్యమైనా కారాగారవాసం తప్పదని చెబుతున్నప్పటికీ.. ఇక్కడ "ఆలస్యం" అనేది కీలకంగా మారిందని అంటున్నారు!