రిపోర్టు: చిన్న నగరాల్లో రిక్రూట్ మెంట్ భారీగా వృద్ధి

ఇప్పడు అందుకు భిన్నంగా మెట్రో నగరాల్లో కాకుండా చిన్న నగరాల్లో తమ కార్యకలాపాలు చేపడుతున్నాయి.;

Update: 2026-02-09 04:34 GMT

దేశంలో ఇప్పటివరకు ఉన్న వ్యాపార సీన్ మారుతోంది. మొన్నటివరకు వ్యాపార సంస్థలు.. కంపెనీలు మెట్రో నగరాల్లోనూ.. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ తమ కార్యకలాపాలు సాగించేందుకు ఆసక్తిని చూపేవి. ఇప్పడు అందుకు భిన్నంగా మెట్రో నగరాల్లో కాకుండా చిన్న నగరాల్లో తమ కార్యకలాపాలు చేపడుతున్నాయి. అందుకు తగ్గట్లే.. చిన్న నగరాల్లో రిక్రూట్ మెంట్ పెరుగుతున్నాయి. ఇదే విషయాన్ని తాజాగా విడుదలైన రిపోర్టు స్పష్టం చేస్తోంది.

ఉద్యోగ నియామకాల్లో చిన్న నగరాల్లో వృద్ధి రేటు ఎక్కువగా ఉంటున్న పరిస్థితి. మెట్రో నగరాలతో పోలిస్తే చిన్న నగరాల్లో వృద్ధిరేటు భారీగా నమోదవుతున్న విషయాన్ని వర్కు ఇండియా వెల్లడించింది. ఈ పరిస్థితికి కొత్త లేబర్ చట్టం కూడా కారణంగా చెబుతున్నారు. ఇటీవల కాలంలో బ్లూ, గ్రే కాలర్ రిక్రూట్ మెంట్ నియామకాల్లో భారీ వృద్ధి నమోదవుతున్న విషయాన్ని ఈ రిపోర్టు వెల్లడించింది.

జాబ్ రిక్రూట్ మెంట్ విషయంలో కొల్హాపుర్ లో 56.3 శాతం.. ఉదయపుర్ లో 55.3 శాతం.. గోవాలో 23.6 శాతం.. విజయవాడలో 20.3 శాతం.. కోచిలో 17.7 శాతం.. కోయంబత్తూరులో 14.1 శాతం.. రాయ్ పూర్ లో 13.9 శాతం వృద్ధి చెందినట్లుగా రిపోర్టు పేర్కొంది. కొత్త కార్మిక చట్టానికి ముందు నుంచి ఉన్న పరిస్థితితో.. కార్మిక చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రెండు నెలల్లో పరిస్థితిని వర్కు ఇండియా సంస్థ విశ్లేషించింది.

సరాసరిలో మెట్రో నగరాల్లో 6.6 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. ఇందులో అహ్మదాబాద్ లో వృద్ధి రేటు భారీగా నమోదైంది. ఇక్కడ నియామకాల రేటు 19.2 శాతం ఉంటే.. ఫుణెలో 13.2 శాతం.. ముంబయిలో 8.8 శాతం.. కోల్ కోతాలో 8.9 శాతం వృద్ధి నమోదైనట్లుగా పేర్కొన్నారు. ప్రధమ శ్రేణి మెట్రో నగరాలతో పోలిస్తే.. చిన్ నగరాల్లో నియామకాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ఇక ఉద్యోగుల్లో ఆఫీసు నుంచి పని చేసే ఉద్యోగాలు 8.7 శాతం పెరిగితే.. ఇంటి నుంచి పని చేసే అవకాశాలు 10.4 శాతం తగ్గినట్లుగా ఈ రిపోర్టు వెల్లడించింది. మరో ఆసక్తికర అంశం ఏమంటే.. చిన్న నగరాల్లోని నియామకాల్లో పురుషుల కంటే స్త్రీలకే ఎకకువ అవకాశాలు దక్కినట్లుగా పేర్కొన్నారు.

Tags:    

Similar News