కరోనా నుండి కోలుకున్నా వేధిస్తున్న సమస్యలు !
కరోనావైరస్ మహమ్మారి నిత్యం విజృంభిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించినా..కరోనా వైరస్ సోకుతూనే ఉంది. అయితే , ఈ కరోనాను అరికట్టే సరైన వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చేవరకు ఈ కరోనా మహమ్మారి జోరు తగ్గేటట్లు కనిపించడం లేదు. ఇప్పటికే దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 66,23,816 కి చేరింది. ఇంకా వేల సంఖ్యలోనే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.
ఇదిలా ఉంతే కరోనా మహమ్మారి భారిన పడి , ఆ మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత ఇప్పుడు చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. వారికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, కళ్లు తిరగడం, అలసట, తేలికపాటి జ్వరం, కీళ్ల నొప్పులు లాంటి సమస్యలు ఉంటున్నాయి. కరోనా నుండి కోలుకున్న చాలామందిని సాధారణ సమస్యలు వేదిస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. అలాగే మరికొంతమందిలో షుగర్ లెవల్స్ పెరగడం , తీవ్ర ఆయాసం ,గుండె దడ , ఛాతిలో పట్టేసినట్టు ఉండటం గుండె , ఊపిరితిత్తుల్లో సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు.
డిశ్చార్జి అయిన 110 మంది రోగుల్లో 81 శాతం మందికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, తరచూ స్పృహతప్పడం, కీళ్ల నొప్పులు లాంటివి ఉన్నాయని బ్రిటన్‌లోని నార్త్ బ్రిస్టల్ ఎన్‌హెచ్ఎస్ ట్రస్ట్ సర్వేలో తేలింది.తీవ్ర ఊపిరితిత్తుల సమస్య లేదా వాటి సామర్థ్యం తగ్గడం లాంటివి ఉన్న రోగులు తక్కువ మంది ఉన్నట్టు ఈ రీసెర్చ్ ప్రాథమిక ఫలితాల్లో కనుగొన్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత నరాలు పక్షవాతానికి గురికావచ్చు. అప్పుడప్పుడూ మెదడుపై కూడా ఆ ప్రభావం పడవచ్చు. దానివల్ల జ్ఞాపకశక్తిపై ప్రభావం ఉండచ్చు. కోవిడ్ వచ్చి ఐసొలేషన్ తర్వాత భయం ఉంటుంది. దానిని ‘పోస్ట్ డిసీజ్ స్ట్రెస్ డిజార్డర్’ అంటారు. మెదడులో వాపు లేదా తీవ్ర ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నరోగుల్లో తర్వాత లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. బలహీనత, కళ్లు తిరగడం లాంటివి సాధారణ లక్షణాలు కూడా ఉంటాయని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో న్యూరాలజీ చీఫ్ డాక్టర్ ప్రవీణ్ గుప్తా తెలిపారు.