మోడీ మీదకు మళ్లుతున్న అనుమానాలు!

Update: 2018-01-14 08:42 GMT
సుప్రీం కోర్టు న్యాయమూర్తుల వివాదం చినికి చినికి గాలివానగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ వివాదం కేవలం న్యాయవ్యవస్థకు పరిమితం అయ్యే వివాదంలాగా కనిపించడం లేదు. రాజకీయ వ్యవస్థ కూడా అనివార్యంగా రోడ్డునపడే వాతావరణం కనిపిస్తోంది. మీడియాలో వస్తున్న వార్తలను బట్టి.. ప్రధాని నరేంద్రమోడీ ప్రమేయం గురించి కూడా పలు అనుమానాలు కలుగుతున్నాయ్ అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి సహేతుకమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి.

మొన్నటిదాకా మెడికల్ కాలేజీలకు సంబంధించిన కుంభకోణం ఒక్కటే ప్రధానంగా తెరపైకి వచ్చింది. తర్వాత.. జస్టిస్ లోయా హత్య కేసు కూడా చర్చల్లో నడిచింది. లోయా హత్య కేసు అనేక మలుపులు తిరుగుతుందేమో అని అనుమానిస్తున్న సమయంలోనే.. ప్రధాని నరేంద్ర మోడీ మనుషులు వెళ్లి.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాను కలవడానికి ప్రయత్నించడం.. దీపక్ మిశ్రా అనుమతించకపోవడంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోవడం అనేది తీవ్రమైన విషయంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒకవైపు సుప్రీం వివాదం తారస్థాయిలో రేగిన సమయంలో.. నరేంద్రమోదీ దూతలాగా.. ఆయన  తరఫు వ్యక్తి సీజే ఇంటి వద్దకు వెళ్లడం.. అనుమానాలను పెంచుతోంది. పీఎంవో లో ముఖ్య కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న నృపేంద్ర మిశ్రా అనే అధికారి..  వివాదం రేగిన తర్వాత.. తాను వ్యక్తిగతం.. సీజే ఇంటి వద్దకు వెళ్లారు. ఇవన్నీ వీడియో ఫుటేజీల సాక్ష్యంతో మీడియాకు బట్టబయలయినట్లు వార్తలు వస్తున్నాయి. నృపేంద్ర మిశ్రా కారు సీజే ఇంటి ప్రహరీ వద్ద చాలాసేపు నిరీక్షించింది. కానీ ప్రహరీ గేట్లు మాత్రం తెరవలేదు. చాలా సేపు నిరీక్షించిన తర్వాత.. నృపేంద్ర మిశ్రా తన కారులో తిరిగి వెళ్లిపోయారు. సీజేను కలవకుండానే వెళ్లిపోయారు.

సుప్రీం విషయంలో ఇంత రాద్ధాంతం జరిగిన సమయంలో నరేంద్రమోదీ ఆఫీసులోని అధికారి సీజే వద్దకు ఎందుకు వెళ్లినట్లు? ఆయనను కలవడానికి కూడా ఇష్టపడకుండా సీజే దీపక్ మిశ్రా కనీసం లోనికి రానివ్వకుండా ఎందుకు అవమానించినట్లు? వీటికి జస్టిస్ లోయా మరణం కేసు దర్యాప్తునకు ఏవైనా సంబంధాలు ఉన్నాయా? అనే అనేక కోణాల్లో అనుమానాలు రేగుతున్నట్లు ప్రజలు భావిస్తున్నారు.
Tags:    

Similar News