మోదీ వచ్చారు... రోహింగ్యా ఊపిరి పీల్చుకో!
చైనాలో జరిగిన బ్రిక్స్ సమావేశానికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ.. మయన్మార్ లోనూ పర్యటన ప్రారంభించారు. భారత్‌కు మిత్రదేశమైన మయన్మార్ తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మయన్మార్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న రోహింగ్యా ముస్లింల వలసలను ప్రధాన విషయంగా తీసుకుని ఆదేశంతో చర్చించాలని ప్రధాని మోడీ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన మయన్మార్ హక్కుల నేత - ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆంగ్ సాన్ సూకీతో ప్రధాని మోడీ భేటీ కానున్నారు.
గతంలో సూకీ భారత్ కు వచ్చినప్పుడు కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించిన మోడీ.. త్వరలోనే మీ దేశం వస్తానంటూ అప్పట్లో వెల్లడించారు. ఇప్పుడు అవకాశం రావడంతో అక్కడికి వెళ్లిన ఆయన సూకీతోనే నేరుగా భేటీ కానున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రోహింగ్యా ముస్లింల వెతలు - భారత్ లో ఉన్న వారిని మయన్మార్ కు రప్పించేలా చర్యలు వంటి కీలక విషయాలపై చర్చించి ఓ నిర్ణయం తీసుకునేలా ప్రోత్సహిస్తారని తెలుస్తోంది. మయన్మార్ నుంచి రోహింగ్యాలు పొరుగు దేశాలకు వలస వెళ్లిపోవడానికి గల కారణాల గురించి కూడా మోడీ చర్చించనున్నారు.
మయన్మార్ ప్రభుత్వ దళాల చేతిలో చిత్రహింసలకు గురవుతున్న రోహింగ్యాలు ప్రాణభయంతో భీతిల్లిపోతున్నారు. బతుకు జీవుడా అంటూ పొరుగు దేశాలకు వలస వెళ్తున్నారు.ఈ క్రమంలోనే భారత్ లో సుమారు 40 వేల మంది రోహింగ్యాలు వచ్చి చేరారు. కాబట్టి వీరిని మయన్మార్ లోకి తిరిగి అనుమతించాలని సూకీకి.. ప్రధాని మోడీ సూచించనున్నట్లు సమాచారం. స్థానికంగా ఉన్న సమస్యలను కూడా సూకీకి వివరించి, వారికి తగు న్యాయం చేసేలా మోడీ కీలక చర్చ చేస్తారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని విదేశాంగ అధికారులు ధ్రువీకరిస్తున్నారు. నిజంగా ఇదే కనుక జరిగితే.. రోహింగ్యాలకు మోడీ ఎంతో చేసిన వారవుతారనడంలో సందేహం లేదు.