ప్రెసిడెంట్ మెడల్.. ఇప్పుడో జోకుగా మారిందా?

Update: 2020-08-17 05:45 GMT
వాట్సాప్.. సోషల్ మీడియా పుణ్యమా అని.. ప్రపంచంలో ఒక చిన్న కుగ్రామంలా మారింది. రోటీన్ కు భిన్నమైన విషయాలు ఏమైనా సరే.. గంటల వ్యవధిలో వైరల్ గా మారటమే కాదు.. వాటికి ఏ మాత్రం సంబంధం లేని ప్రభుత్వాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. గడిచిన వారంలో ‘ప్రెసిండెట్ మెడల్’ పేరుతో పేలుతున్న జోకులు.. వ్యంగ్య వ్యాఖ్యలు ఇప్పుడు విపరీతంగా అందరిని ఆకర్షిస్తున్నాయి.

ఇంతవరకు ప్రెసిడెంట్ మెడల్ అన్నంతనే.. రాష్ట్రపతి ఇచ్చే మెడల్ గా తెలిసిందే. అయితే.. ఏ దరిద్రపు గొట్టు కంపెనీకి ఐడియా వచ్చిందో కానీ.. అంతటి గౌరవప్రదమైన పేరును మద్యం బ్రాండుగా వాడేశారు. ఏపీలో ఇప్పుడు లభ్యమవుతున్న ఈ బ్రాండ్ మీద పడుతున్న సెటైర్లు అన్ని ఇన్ని కావు. ఏపీలోని మందుబాబులకు సుపరిచితంగా మారిన ఈ బ్రాండ్ కారణంగా ఏపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది.

ఏ చిన్న అవకాశం చిక్కినా ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు సిద్ధంగా ఉండే శక్తులకు ఇలాంటివి సాయంగా నిలుస్తున్నాయి. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త తరహా మద్యం పాలసీని తీసుకురావటం.. మద్యం ధరల్ని భారీగా పెంచటం ద్వారా వినియోగాల్ని తగ్గించేలా చర్యలు తీసుకున్నారు.  అంతేకాదు మద్యం దుకాణాల్ని ప్రభుత్వమే నిర్వహిస్తున్న వైనం తెలిసిందే.

 ఈ నిర్ణయం కొంతమేర ఫలితం ఇస్తున్నా.. ప్రెసిడెంట్ మెడల్ లాంటి బ్రాండుల పుణ్యమా అని చేస్తున్న మంచి ప్రయత్నానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇలాంటి వాటి విషయాల్ని ఏపీ అధికారులు మరింత సీరియస్ గా తీసుకోవాలన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి పేర్లు పెట్టిన సంస్థలకే కాదు.. ఇలాంటి పేర్లను బ్రాండ్ లుగా వాడేందుు అనుమతి ఇచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News