ఫలితాల రోజే ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం

Update: 2021-05-02 11:31 GMT
పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఫలితాల రోజే ఓ సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి తాను ఎన్నికల వ్యూహాలు రచించబోనని.. ఏ పార్టీకి పనిచేయనని స్పష్టం చేశారు.

ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని.. కానీ ఇక నుంచి ఏ రాజకీయ పార్టీ గెలుపు కోసం వ్యూహకర్తగా పనిచేయనని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.

బెంగాల్ లో బీజేపీ హిందూత్వ కార్డును విరివిగా వాడినా.. ఎన్నికల సంఘం చూసి చూడనట్లు వదిలేసినా చివరికి విజయం మాత్రం తృణమూల్ కాంగ్రెస్ సొంతమైంది. బెంగాల్ లో మమతను గెలిపించడానికి పీకే చేసిన వ్యూహాలు ఫలించాయి.

బెంగాల్ సీఎం మమతపై బీజేపీ నేతలు దాడి చేయగా.. కాలుకు కట్టుకొని వీల్ చైర్ లో ప్రచారం చేసేలా చేసిన ఐడియా పీకేదేనని.. అందుకే ఆ సెంటిమెంట్ ఐడియా పనిచేసి మమత గెలిచి.. బీజేపీ ఓటమి పాలైందని టాక్ వినిపిస్తోంది.

మొత్తంగా ఏపీలో పోయిన ఎన్నికల్లో జగన్ ను .. అంతకుముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను.. ఇప్పుడు బెంగాల్ లో మమతను గెలిపించిన ప్రశాంత్ కిషోర్ ఇక ఏ పార్టీ తరుఫున వ్యూహకర్తగా పనిచేయనని చెప్పడం సంచలనమైంది. బహుషా సొంతంగా పార్టీ పెట్టి రాజకీయాల్లోకి పీకే వస్తాడనే ప్రచారం సాగుతోంది.




Tags:    

Similar News