ప్రశాంత్ కిశోర్ కు అంత పొగరా? వైఎస్సార్సీపీ ఆగ్రహం

Update: 2020-02-22 09:30 GMT
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వైఖరి మారుతోంది.. అతడు దుందుడుకుతనంతో విమర్శల పాలవుతున్నాడు. బీజేపీ తీరును విమర్శిస్తూ జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన ఆయన ఇప్పుడు సొంతంగా రాజకీయంగా ఎదగాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే రాజకీయంగా దూకుడుగా వెళ్తున్నాడు. అయితే అతడి ప్రవర్తన సక్రమంగా ఉండడం లేదు. ప్రస్తుతం అతడి తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ గెలుపునకు విశేష కృషి చేసిన వ్యక్తిపై ఆ పార్టీ నాయకులు విమర్శించడమేంటి? అతడి వైఖరిపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం ఏమిటి? తెలుసుకుందాం.

ఇటీవల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన భార్య భారతీరెడ్డితో కలిసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాడు. అక్కడ జరిగిన ఓ వివాహానికి హాజరయ్యారు. ఆయనెవరో కాదు.. గత ఎన్నికల్లో తన గెలుపు కోసం వ్యూహా రచన చేసిన ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ సంస్థ ఉంది. ఆ ఐప్యాక్‌ సహ వ్యవస్థాపకుడు రిషిరాజ్ సింగ్ కూడా జగన్ గెలుపునకు పని చేశాడు. ఈ నేపథ్యంలో అతడి వివాహాం ఫిబ్రవరి 16న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని లక్నోలో జరిగింది. ఆ వివాహానికి ప్రత్యేక విమానంలో భారతీరెడ్డితో కలిసి వెళ్లారు. లక్నోలోని గోమ్‌ తీనగర్‌ లో ఉన్న హోటల్‌ తాజ్‌ మహల్‌ లో జరిగిన వివాహ వేడుకకు హాజరైన సందర్భంలో ప్రశాంత్ కిశోర్ వ్యవహారం సక్రమంగా లేదు.

వివాహానికి హాజరైన సమయంలో జగన్ మోహన్ రెడ్డి - ప్రశాంత్ కిశోర్ పక్కపక్కన కూర్చున్నారు. ఆ సందర్భంగా జగన్ పక్కన ప్రశాంత్ కిశోర్ కాలు మీద కాలేసుకుని కూర్చున్నారు. ఆ విధంగా కూర్చుని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తో మాట్లాడుతూ కనిపించారు. ఆ ఫొటో ఆంధ్రప్రదేశ్ లో వైరలైంది. ఆ ఫొటో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు - జగన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి పక్కన కూర్చునే తీరు అదెనా? జగన్ కు ఇచ్చే మర్యాద ఇదేనని అధికార పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ తీరుపై మండిపడుతున్నారు.


Tags:    

Similar News