విషమంగానే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం

Update: 2020-08-16 10:50 GMT
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలిసింది. మెదడులో రక్తం గడ్డం కట్టడంతో ఆయనకు ఢిల్లీలో మిలటరీ ఆస్పత్రిలో క్లిష్టమైన ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం వెంటి లేటర్ పై ఆయన చికిత్స పొందుతున్నారు.

వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదని ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి ప్రకటించింది.

గతంలో ఉన్న అనారోగ్య సమస్యల కారణంగా ప్రణబ్ త్వరగా కోలుకోలేకపోతున్నారని..నిపుణులైన వైద్య బృందం ప్రణబ్ ను పర్యవేక్షిస్తున్నట్టు ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది.

ఇటీవల ఆయన చనిపోయాడని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రాగా.. ఆయన కుమారుడు ఈ వార్తలను ఖండించారు. ప్రణబ్ బతికే ఉన్నాడని వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడని వివరణ ఇచ్చాడు. అయితే ప్రణబ్ ఆరోగ్యం మాత్రం ఇప్పటికీ కుదుటపడడం లేదు.
Tags:    

Similar News