జగన్ తో వెళ్లమని రాహుల్ కు పెద్దాయన సూచన?

Update: 2019-05-15 06:27 GMT
కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు అవకాశమే వస్తే, ప్రాంతీయ పార్టీల సహకారంతో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితుల్లో ఎవరి మద్దతు తీసుకోవడం మంచిదనే అంశంలో రాహుల్ గాంధీకి కీలకమైన సూచనలు చేస్తూ ఉన్నారట మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. కాంగ్రెస్ నేతగా ఉన్న రోజుల్లో ప్రణబ్ ముఖర్జీ పార్టీకి ట్రబుల్ షూటర్ గా ఉండేవారని వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు కూడా ఆయన  తన మేరకు సలహాలు ఇస్తున్నట్టుగా సమాచారం.

అందులో భాగంగా ఏపీ నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి మద్దతు తీసుకోవడం కన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతు తీసుకోవడమే మేలని ప్రణబ్ సూచించారట. అందుకు వివిధ లాజిక్స్ ను కూడా వివరించారట ప్రణబ్ ముఖర్జీ.

ఏపీలో వైఎస్ జగన్ అధికారం చేపట్టే అవకాశం ఉంది. అప్పుడు ఆయన ఏపీ వ్యవహారాల మీదే ఎక్కువగా దృష్టినిలుపుతాడు. కేంద్ర రాజకీయాల వైపు అంతగా జోక్యం చేసుకోడు. అదే చంద్రబాబు నాయుడుకు ఏపీలో పవర్ పోతే ఆయన ఎంతసేపూ ఢిల్లీలోనే మకాం పెట్టి పుల్లలు పెడుతూ ఉంటారు.

కాంగ్రెస్ కు మద్దతు విషయంలో జగన్ కు పెద్దగా అభ్యంతరాలు లేవు. కేవలం ప్రత్యేకహోదా మాత్రమే  జగన్ కోరుతున్నది. ఆ విషయంలో ఎలాగూ కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉంది కాబట్టి… జగన్ ను కన్వీన్స్ చేయడం సులువు అవుతుందని ప్రణబ్ తన సూచనగా రాహుల్ కు చెప్పారని ఢిల్లీ వర్గాల భోగట్టా.

అయినా మెజారిటీ ఎంపీ సీట్లను జగన్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో రాహుల్ కూడా జగన్ ను కన్వీన్స్ చేసుకోవడానికే ప్రయత్నాలు సాగించాల్సి రావొచ్చు అని విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News