కేసీఆర్ ది బంగారు మనసు..ప్రకాశ్ రాజ్ ప్రశంసలు
బాలీవుడ్‌తోపాటు అన్ని భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో సినీ కార్మికులకు అండగా ఉంటున్నారు. ఆయన తన నివాసంలోనే ఉంటూనే సినీ కార్మికులకు అండగా ఉంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సేవా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఓ మీడియాతో ఆయన తాజాగా మాట్లాడారు. ఈ క్రమంలో లాక్‌డౌన్ పరిస్థితులు, కరోనా కట్టడి చర్యలపై ప్రకాశ్ రాజ్ స్పందించారు.
తనకైన, ప్రధానమంత్రి మోదీకైనా శత్రువు ఒక్కటే కరోనా అని, దాన్ని నివారించడంలోనే మనమంతా భాగం కావాలని పిలుపునిచ్చారు. అయితే ఏ ఒక్కరూ రాజకీయాలు మాట్లాడకూడదంటూ హితవు పలికారు. వ్యక్తిగత విభేదాలకు పోకుండా అందరం కలిసి పోరాటం చేయాల్సిన సమయమిది అని గుర్తుచేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో కరోనా కట్టడికి సీఎం కె.చంద్రశేఖర్ రావు తీసుకుంటున్న నిర్ణయాలు భేష్ అని ప్రకాష్ రాజ్ కొనియాడారు. ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చే భరోసా అందరిలో ధైర్యం నింపుతోందని పేర్కొన్నారు. కేసీఆర్ వ్యక్తిత్వం గొప్పదని, ఆయన మనసు బంగారమని ప్రశంసలు కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు వ్యక్తిగత శతృత్వం లేదని, ఇలాంటి విపత్కర పరిస్థిత్తుల్లో భారత ప్రభుత్వం తీసుకొనే ప్రతీ నిర్ణయాన్ని స్వాగతించాలని వెల్లడించారు.
ఈ కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత లాక్‌డౌన్‌తో మంచి జరిగిందా? చెడు జరిగిందా అనే దానిపై ఆలోచించాలి తప్ప ఇప్పుడైతే అందరం సమష్టిగా ఆ మహమ్మారిఇపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తన సేవా కార్యక్రమాలపై స్పందించారు. ఆర్థికంగా తాను వెనకబడినా వెనక్కి తగ్గనని, బ్యాంకులో రుణం తీసుకునైనా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని స్పష్టం చేశారు.