ఢిల్లీలో దారుణం.. నరం కత్తిరించి 'దేవుడి'పై నెట్టేసిన డాక్టర్!

ఢిల్లీలో దారుణ సంఘటన వెలుగు చూసింది. శస్త్రచికిత్స చేసిన వైద్యుడి నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కోవాల్సివచ్చింది

Update: 2026-06-25 06:34 GMT

ఢిల్లీలో దారుణ సంఘటన వెలుగు చూసింది. శస్త్రచికిత్స చేసిన వైద్యుడి నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కోవాల్సివచ్చింది. ఇదేమని ప్రశ్నిస్తే, అంతా అల్లా నిర్ణయం అంటూ ఆ వైద్యుడి చెప్పిన సమాధానంతో బాధితురాలు షాక్ కు గురైంది. ఈ సంఘటనపై మీడియాతో మాట్లాడిన బాధితురాలు వైద్యుడి నిర్లక్ష్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పొరపాటున నా ప్రాణం పోయినా ‘దేవుడి సంకల్పం’ అంటూ డాక్టర్ తప్పించుకుంటాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు జరిగిన అన్యాయంపై ఢిల్లీ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

వైద్య వృత్తికి ఉన్న పవిత్రతను, విశ్వాసాన్ని మంటగలిపేలా ఈ ఘటన ఉందని బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం అల్వీ నర్సింగ్ హోమ్‌లో కిడ్నీలో రాళ్లు తొలగించడానికి ఆమె తొలుత శస్త్రచికిత్స చేయించుకుంది. ఆపరేషన్ తర్వాత డిశ్చార్జి చేయడంతో ఇంటికి వెళ్లిపోయింది. అయితే సుమారు 15-20 రోజుల తర్వాత ఆమెకు మళ్ళీ తీవ్ర అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. దీంతో అల్వీ నర్సింగ్ హోమ్‌కు వెళ్లి వైద్యులను సంప్రదించగా, కామెర్ల వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. తదుపరి చికిత్స నిమిత్తం ఆమెను పంత్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ నిర్వహించిన ఎం.ఆర్.ఐ పరీక్షలో అసలు వాస్తవం బయటపడింది. శస్త్రచికిత్స సమయంలో వైద్యులు పొరపాటున ఒక ముఖ్యమైన నరాన్ని కత్తిరించారని, దానివల్ల లీకేజీ జరిగి కామెర్లు పెరిగాయని తేలింది. దీనివల్ల ఆమెకు మరోసారి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని వాపోయింది.

'అల్లా ఇచ్ఛ' అంటూ వైద్యుడి సమాధానం

తన ఆరోగ్య పరిస్థితి క్షీణించడానికి కారణమైన ఘటనపై బాధితురాలు తొలుత చికిత్స చేయించుకున్న వైద్యులను నిలదీసినట్లు మీడియాకు తెలిపింది. జరిగిన పొరపాటు వల్ల తన ఆరోగ్యం పాడైందని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆసుపత్రి వైద్యులు మాత్రం తాము చేసిన పనికి సిగ్గు పడకుండగా, కనీసం బాధితురాలి పట్ల సానుభూతి వ్యక్తం చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని చెబుతున్నారు. పొరపాటు చేశామని అంగీకరించకుండా, తప్పు తమది కాదని ‘అల్లా ఇచ్ఛ’ (అల్లా నిర్ణయం) అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారని మండిపడింది బాధితురాలు. డాక్టర్ కారణంగా తాను ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటే రూ.1500 చేతిలో పెట్టి డాక్టర్ తన చేతులు దులుపుకోవాలని చూశాడని ఆవేదన వ్యక్తం చేసింది.

తీవ్ర ఆగ్రహం

బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్లడంతో ఈ ఘటన వెలుగు చూసింది. డాక్టర్ నిర్లక్ష్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఒక వేళ తన ప్రాణం పోయినా సదరు వైద్యుడు ‘దేవుడిపై భారం’ వేసి తప్పించుకుంటాడా? అంటూ ఆమె ప్రశ్నించడం ఆలోచనలకు గురిచేస్తోందని అంటున్నారు. వైద్య వృత్తిలో మానవీయ కోణాన్ని, బాధ్యతను పణంగా పెడుతున్న ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దేవుడి ప్రతిరూపంగా డాక్టర్లను నమ్మే సామాన్యులకు, తమ తప్పులను దేవుడిపైకి నెట్టే ఇలాంటి వైద్యులు తీరని అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News