ఒకే గ్రామంలో 600 మందికి పాజిటివ్ .. !

Update: 2021-05-04 04:38 GMT
కరోనా వైరస్ కారణంగా ఆ ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. నిత్యం మనుషుల తాకిడి తో కళకళలాడే విధులన్నీ బోసిపోయాయి. పిల్లల ఆట , పాటలతో ఎంతో సందడిగా ఉండే ఆ గ్రామం మొత్తం నిశబ్దంగా ఉంది. కేవలం వృద్దులు మాత్రమే ఆ ఊర్లో కనిపిస్తున్నారు. ఊర్లో ఉన్న పిల్లలు ఏమైయ్యారు అంటే .. పొలాల వైపు చూపిస్తున్నారు. జనం పెద్ద పెద్ద ఇళ్లను వదిలేసి , పొలం గట్లపై, బావుల దగ్గర చిన్న, చిన్న గుడిసెల్లో తలదాచుకుంటున్నారు. వైరస్‌ ఊళ్లోకి ఎంట్రీ ఇవ్వడంతో .. ఊరి జనం ఊరిబయటకు తరలిపోయారు. ఇదీ వికారాబాద్‌ మండలం ఎర్రవల్లి దయనీయస్థితి. కరోనా విజృంభణతో ఊరంతా చెల్లాచెదురైంది. చెట్టుకొకరు, పుట్టకొకరు అన్నట్టుగా ఎవరికీ తోచిన కాడికి వారు వెళ్లిపోయారు. ఆ ఊరి జనాభా 1,400 మంది.. వారిలో దాదాపుగా 600 మందికి కరోనా వైరస్‌ సోకింది. శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడి వారం క్రితం ఇద్దరు మృతి చెందారు.
 
దీనితో ఊరి జనమంతా వెళ్లిపోయి తమ తమ వ్యవసాయ పొలాల వద్ద గుడిసెలు వేసుకొని క్వారంటైన్‌ లో ఉంటున్నారు.  గ్రామంలో హెల్త్‌ క్యాంపు ఏర్పాటు చేసి అందరికీ టెస్టులు చేయాలని ఇటీవల గ్రామానికి వచ్చిన కలెక్టర్‌ కు విన్నవించారు. అయినా ఎలాంటి స్పందన లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ ఒక ఏఎన్‌ ఎం మాత్రం గ్రామానికి వచ్చి వెళ్తోందని చెబుతున్నారు. కరోనాతో చనిపోయినవారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాకపోవడంతో కోఆప్షన్‌ మెంబర్‌ జాఫర్‌ జేసీబీల సాయంతో గుంతలు తవ్వించి మృతదేహాలను పూడ్చివేయిస్తున్నారు.  గ్రామంలో సగం మందికి కరోనా వచ్చింది. ఊరు విడిచి పొలాల్లో ఉంటున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులేమో పట్టించుకోవడం లేదు. గ్రామంలో ఎప్పుడు, ఎవరు చనిపోతారోనని భయపడుతున్నాం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోరా.. మా బతుకు ఇంతేనా, చావాల్సిందేనా అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.
Tags:    

Similar News