హైదరాబాద్ 'గ్రీన్ జోన్' అయ్యేదెప్పుడు?
తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గాయి. కానీ హైదరాబాద్ లో మాత్రం తగ్గడం లేదు. రోజురోజు విస్తరిస్తూనే ఉంది. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని జిల్లాలను మూడు జోన్లుగా విభజించారు. గ్రీన్ - ఆరెంజ్ - రెడ్ లుగా వర్గీకరించారు. కరోనా ఆనవాళ్లే లేని జిల్లాలను గ్రీన్ జోన్ గా.. ఇదివరకు కరోనా వ్యాపించి తగ్గిన జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా.. ఇప్పటికీ కరోనా విస్తరిస్తున్న జిల్లాను రెడ్ జోన్ గా ప్రకటించారు. దేశంలోని కొన్ని మెట్రోపాలిటన్ నగరాలు పూర్తిగా కరోనా లేకపోవడంతో ‘నో జోన్’గా ఉన్నాయి. ఇలా మూడు జోన్ లుగా దేశాన్ని వేరుచేసే లాక్ డౌన్ ను మరో రెండు వారాల పాటు మోడీ సర్కారు విస్తరించింది. ప్రతిరోజూ కేసుల సంఖ్య నమోదవుతున్నందున హైదరాబాద్ రెడ్ జోన్ లో పడిపోయింది.
లాక్ డౌన్ మే 17 వరకు పొడిగించబడినప్పటికీ - తక్కువ కరోనా రిస్క్ ఉన్న గ్రీన్ జోన్ - ఆరెంజ్ జోన్ లలో కొంత సడలింపులు ఇచ్చారు. కానీ రెడ్ జోన్లో ఇవ్వలేదు. రెడ్ జోన్ ప్రాంతాలు గ్రీన్ జోన్ గా మారడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. ఎప్పుడనేది ఊహించడం కూడా మన చేతుల్లో లేదు.
కేంద్ర ఆరోగ్య శాఖ ఆమోదించిన నిబంధనల ప్రకారం - వరుసగా 21 రోజులు రెడ్ జోన్ ప్రాంతాల్లో సానుకూల కేసులు లేనప్పుడు మాత్రమే రెడ్ జోన్ ప్రాంతాలు గ్రీన్ జోన్ గుర్తించబడతాయి. దేశంలో ఎక్కడైనా గ్రీన్ జోన్ లలో వైరస్ ప్రబలితే మళ్లీ రెడ్ జోన్ గా ప్రభుత్వం మారుస్తుంది. అలాగే ఆరెంజ్ జోన్ లో 21 రోజుల వరకు కేసులు లేకుంటే అది గ్రీన్ జోన్ గా మారుతుంది.
తెలుగు రాష్ట్రాలు మరియు హైదరాబాద్ రెండింటిలోనూ అనేక రెడ్ జోన్లు ఉన్నాయి. రెడ్ జోన్ లో దాదాపు పూర్తి లాక్ డౌన్ నియంత్రణ పరిమితులు ఉంటాయి. మిగతా గ్రీన్ - ఆరెంజ్ జోన్లలో మినహాయింపులు చూసి ఇక్కడి వారిలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. తమకెందుకు ఈ బాధలు అంటున్నారు. అందరికీ ఫ్రీ వదిలేయాలని డిమాండ్ చేస్తున్నారు. రెడ్ జోన్లలో మెడికల్ క్లినిక్స్ - ఇండస్ట్రీస్ - సింగిల్ నాన్-ఎసెన్షియల్ షాప్స్ - ఇ-కామ్ ఎసెన్షియల్ గూడ్స్ - అగ్రి యాక్టివిటీస్ - బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ - కొరియర్ మరియు పోస్టల్ - గూడ్స్ ట్రాఫిక్ - మరియు యాక్సెస్ కంట్రోల్ ఉన్న ఇండస్ట్రియల్స్ వంటి వాటికి కొన్ని సడలింపులు ఉన్నాయి. నియంత్రణ ప్రాంతాల్లో మాత్రం గట్టి నిఘా ఉంటుంది. .
ఒకే కేసు లేకుండా వరుసగా 21 రోజులు కొనసాగడానికి చాలా కాలం సమయం పట్టే అవకాశాలున్నాయి. నెలలు గడిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాని ఇప్పటి నుండి కేసుల సంఖ్యను పెంచకుండా స్టిక్ట్ గా అమలు చేస్తేనే అది సాధ్యం.. సడలింపులు మార్చకపోతే సాధించవచ్చు.