హోం క్వారంటైన్ లో ఉండమంటే 163 సార్లు బయటకెళ్లాడు... !

Update: 2020-07-16 01:30 GMT
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ఎంతలా విజృంభిస్తుందో అందరూ చూస్తున్నారు. వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు భారీగా పడుతుంది. కరోనా సోకిన వారిని కాపాడటానికి వైద్యులు , వైద్య సిబ్బంది తమ ప్రాణాలని పణంగా పెట్టి మరీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ వైరస్ కి ఇంకా సరైన వ్యాక్సిన్ కనిపెట్టకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన పెరిగిపోతుంది. లాక్ డౌన్ సడలింపుల తర్వాత కరోనా కేసులు మరింతగా పెరుగుతుండటంతో ఇతర రాష్ట్రాల నుంచి సొంత నగరాలకు వచ్చిన వారికి ప్రభుత్వం 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌ విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ,కొంతమంది హోమ్ క్వారంటైన్ లో ఉంటూ కూడా ఏ మాత్రం నిబంధనలు పాటించకుండా బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు.

ఇలాగే , ఓ వ్యక్తి ఇటీవలే ఇతర ప్రదేశం నుండి రావడంతో అధికారులు అతనిని 14 రోజుల హోం క్వారంటైన్ లో ఉండమని చెప్తే …ఆ మాటలని పెడచెవిన పెట్టి ఏకంగా 163 సార్లు ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు అని అధికారులు గుర్తించారు. హోమ్ క్వారంటైన్ లో ఉన్న అతని మొబైల్ సెల్ కు ఏర్పాటు చేసిన GPS tracker సాయంతో ఈ విషయం బయటపడింది. దీనితో ఆ ప్రాంత వాసుల్లో ఆందోళన మొదలైంది.

పూర్తి వివరాలు చూస్తే .. కర్ణాటక .రాష్ట్రానికి చెందిన సహబ్ సింగ్ అనే వ్యక్తి జూన్ ‌29ను ముంబైలోని కోటేశ్వరా ప్రాంతం నుండి ఉడిపికి వచ్చాడు. దీనితో ప్రభుత్వ నియమాల ప్రకారం తనకి హోం క్వారంటైన్‌ విధించాని అధికారులను కోరారు. దీనితో అతనికి జూలై 3 వరకు ఇంట్లోనే ఉండాలని తెలిపారు. అయితే ఆ నిబంధనలు లెక్కచేయకుండా సహబ్‌ సింగ్‌ ఉడిపితో పాటు కుందపూర్, పలు హోటళ్లను సందర్శించారు. 14 రోజుల హోం క్వారంటైన్‌ టైం లో దాదాపుగా 163 సార్లు అతను ఇంట్లో నుండి బయటకు వెళ్లినట్టు తేలింది. దీనితో క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంగా అతనిపై కుందపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
Tags:    

Similar News