బండి సంజయ్ - అక్బరుద్దీన్‌‌ కి షాక్ ఇచ్చిన పోలీసులు..ఏంటంటే?

Update: 2020-11-28 09:30 GMT
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడేకొద్ది .. నేతల మధ్య మాటల యుద్ధం పెరిగిపోతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు - ఎంపీ బండి సంజయ్ - ఎంఐఎం పార్టీ నేత - ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. గ్రేటర్ ప్రచారంలో భాగంగా వీరిద్దరూ అనుచితంగా వ్యాఖ్యలు చేసిన కారణంగా    పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేశారు. ఈ మేరకు వీరిద్దరిపై ఎస్ ఆర్ నగర్ పోలీసులు ఐపీఎస్‌ 505 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

పాత బస్తీలో అక్రమంగా రోహింగ్యాలు నివసిస్తున్నారని, వారిపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  తర్వాత  ఆక్రమణల నేపథ్యంలో హుస్సేన్ సాగర్ పక్కనే ఉన్న ఎన్టీఆర్ పీవీ ఘాట్లు ను కూల్చివేయాలంటూ అక్బరుద్దీన్ ఓవైసీ వ్యక్తం చేశారు. దానికి కౌంటర్ గా బండి సంజయ్ దారుస్సలాంలో ఉన్న ఎంఐఎం పార్టీ కార్యాలయాన్ని రెండు గంటల్లో మా కార్యకర్తలు కూల్చివేశారంటూ వ్యాఖ్యానించారు. ఇలా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ రాజకీయ దుమారాన్ని రేపాయి.  దీంతో లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఇద్దరిపైనా సెక్షన్ 505 కింద కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఇద్దరి దగ్గర నుంచి కూడా పోలీస్ స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. అయితే ఇటీవల ఓయూలోకి అనుమతి లేకుండా వెళ్లి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News