రైతుల కోసం లాఠీ దెబ్బలు తిన్న 'ఎంపీలు' !
ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి తమకి నచ్చని అంశం పై నిరసన తెలిపే అవకాశం ఉంది. సామాన్యుల నుండి ప్రజాప్రతినిధుల వరకు ఎవరైనా కూడా నిరసన తెలుపవచ్చు. అయితే , తాజాగా కేంద్రం రైతుల కోసం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లుల పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కేంద్రం మాత్రం ఈ బిల్లుల ద్వారా రైతులకి మంచి జరుగుతుంది అని అంటుంటే , విపక్షాలు మాత్రం ఈ బిల్లు వల్ల రైతులకి నష్టం అంటూ బిల్లుని వ్యతిరేకిస్తున్నారు. అయితే, ప్రభుత్వానికి భారీ మెజారిటీ ఉండటంతో ఈ వ్యవసాయ బిల్లు పార్లమెంట్ లో పాస్ అయింది. మరోవైపు ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలనే తీర్మానానికి రాజ్యసభ ఎంపీలు పట్టుబడుతున్నారు. ఈ సందర్భంగా సభలో పోడియంలోకి దూసుకెళ్లి, ఆందోళనకు దిగారు. ఇది 8మంది ఎంపీల సస్పెన్షన్ కు దారితీసింది. అయితే పట్టువదలకుండా పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు తమ నిరసనను కొనసాగించారు.
ప్రధానంగా పార్లమెంటు సమీపంలో సోమవారం మౌనంగా నిరసన చేపట్టిన పంజాబ్‌కు చెందిన నలుగురు పార్లమెంటు సభ్యుల పట్ల ఢిల్లీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఎంపీల కాళ్లపై లాఠీలతో కొడుతూ, వారిని అక్కడినుంచి తొలగించేందుకు ప్రయత్నించారు. పార్లమెంటు షెడ్యూల్ కంటే ముందే బయలుదేరిన మోదీ కి దారి క్లియర్ చేసేందుకు ప్రయత్నించామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అంతేకాదు ఎంపీలు తమ నిరసనకు ఎటువంటి అనుమతి తీసుకోలేదని, ప్రధానికి దారి క్లియర్ చేయడం తప్పనిసరి అని, మరోవైపు మంగళవారం ఉదయం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నిరసన చేస్తున్న ఎంపీల వద్దకు వెళ్లి, వారిని పరామర్శించారు. టీ తాగాలని కోరారు. దీనికి ససేమిరా అన్న ఎంపీలు ఆయన్ను రైతు వ్యతిరేకి అంటూ విమర్శించారు.
కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లులును వ్యతిరేకిస్తూ సెప్టెంబరు 25న దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వ తీసుకొచ్చిన ప్రస్తుత బిల్లుతో దేశంలోని చిన్న, సన్నకారు రైతులు మరింత నష్టాల్లోకి జారిపోతారని రైతు సంఘాలు వాదిస్తున్నాయి. ఈ బిల్లులు కార్పొరేట్లకు కొమ్ము కాసేవే తప్ప, రైతులకు మేలు చేసేవి ఎంతమాత్రం కాదని వాదిస్తున్నాయి. సస్పెన్షన్ కి గురైన 8 మంది ఎంపీలు, రాత్రి మాత్రం పార్లమెంట్ ఎదుట తమ నిరసనను కొనసాగించారు. నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా బిల్లులును సభలో ఆమోదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకి మేలు చేయడమే తమ లక్ష్యం అని , వారికోసం పోరాడుతూనే ఉంటాం అంటూ తెలిపారు.