బీసీలకు 34 శాతం రిజర్వేషన్.. బాబు మరో హామీ సాకారం.. !
దీంతో మెజారిటీగా ఉ న్న బీసీలకు అన్యాయం జరుగుతోందన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే గత ఎ న్నికలకు ముందు బీసీలు.. చంద్రబాబును కలిసి తమ రిజర్వేషన్ వ్యవహారాన్ని తేల్చాలని విన్నవించారు.;
బీసీ సామాజిక వర్గాలకు మరోసారి ప్రాధాన్యం పెరగనుంది. వాస్తవానికి ఆది నుంచి బీసీల పక్షంగా ఉన్న టీడీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. వారికి ప్రాధాన్యం ఇస్తోంది. ఇతర సామాజిక వర్గాలకు కూడా అవ కాశం ఇస్తూనే బీసీ జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారికి మరింత ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యం లో గత 2024 ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. దీంతో బీసీలకు రాష్ట్రంలో మరింత ప్రాధాన్యం పెరగనుంది.
గత ఎన్నికల సమయంలో నామినేటెడ్ పదవులకు కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చం ద్రబాబు హామీ ఇచ్చారు. వీటిలో ప్రధానంగా.. ఉన్న పదవులకు 34 శాతం మందిని బీసీలను ఎంపిక చే యాలన్నది చంద్రబాబు లక్ష్యం. అయితే.. ఈ విషయంలో గతంలో వైసీపీ అనుసరించిన విధానం ఇబ్బం దిగా మారింది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు కూడా కలిపి 50 శాతం రిజర్వేషన్‌ను మాత్రమే వర్తింపచేసేలా అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో మెజారిటీగా ఉ న్న బీసీలకు అన్యాయం జరుగుతోందన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే గత ఎ న్నికలకు ముందు బీసీలు.. చంద్రబాబును కలిసి తమ రిజర్వేషన్ వ్యవహారాన్ని తేల్చాలని విన్నవించారు. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే.. 34 శాతం(ఇంతకుముందు 33 శాతం ఉండేది) రిజర్వేషన్ ను నామినేటెడ్ పదవుల్లోనూ అనుసరిస్తామని హామీ ఇచ్చారు. దీని ప్రకారం.. తాజాగా వైసీపీ ఇచ్చిన గత జీవోపై న్యాయ సలహాలు.. సూచనలు తీసుకున్నారు.
అయితే.. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ జీవో ఇచ్చారని పేర్కొన్నప్పటికీ.. సుప్రీంకోర్టు.. కేవలం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మాత్రమే 50 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని సూచించింది. అయితే.. అప్పట్లో వైసీపీ బీసీలకు కూడా ఇది వర్తించేలా నామినేటెడ్ పదవులను మార్చేసింది. ఫలితంగా.. బీసీలకు నష్టం వాటిల్లింది. ఇప్పుడు దీనిని సరిచేసి నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకు 34 శాతం హామీని నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.