రూ.100 నాణెం విడుదల చేస్తున్న మోడీ

Update: 2020-10-12 09:50 GMT
గాంధీ నుంచి దేశంలోని ప్రముఖుల జయంతులు, వర్థంతులను ప్రధానిగా మోడీ అయ్యాక వినూత్నంగా నిర్వహిస్తున్నారు. వారికి అమిత గౌరవాన్ని ఇస్తూ దేశభక్తిని పెంపొందించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ రాజమాతకు తాజాగా గౌరవాన్ని ఇవ్వబోతున్నారు.

ఒకప్పుడు రాజస్థాన్ ప్రాంతాన్ని పరిపాలించిన రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ సోమవారం రూ.100 నాణేన్ని విడుదల చేయనున్నారు.

జనసంఘ్ నాయకురాలైన విజయరాజే సింధియా బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు కూడా. అందుకే మోడీ ఆమె గుర్తుగా.. బీజేపీకి చేసిన సేవలకు గాను ఈ గౌరవాన్ని ఇస్తున్నారు.

వర్చ్యువల్ గా జరిగే ఈ కార్యక్రమంలో మోడీ రూ.100 నాణేన్ని రాజమాత పేరుగా మీదుగా విడుదల చేస్తారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింధియా కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నాణేన్ని ఆర్థిక శాఖ రూపొందించింది.
Tags:    

Similar News