మోడీ.. దీన్ని కూడా వదల్లేదు..

Update: 2019-04-23 04:22 GMT
ప్రధాని నరేంద్రమోడీ తన సొంతరాష్ట్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. గుజరాత్  రాష్ట్రం అహ్మదాబాద్ లోని రనిప్ పోలింగ్ బూత్ లో ఓటేశారు. గాంధీనగర్ లోని నివాసంలో తన తల్లి మోడీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమెతో కాసేపు గడిపి అనంతరం పోలింగ్ బూత్ కు బయలు దేరారు. పోలింగ్ స్టేషన్ వద్ద అమిత్ షా, ఆయన కుటుంబ సభ్యులు మోడీకి స్వాగతం పలికారు.

అయితే మోడీ ఇక్కడ కూడా పబ్లిసిటీతోపాటు సింప్లిసిటీకి ప్రాధాన్యతనివ్వడం విశేషం. వీఐపీ అత్యున్నత ప్రొటోకాల్ ఉన్నా కూడా.. సాధారణ ప్రజలతోపాటు క్యూలైన్ లో నిల్చొని మోడీ ఓటు వేశారు. దీన్ని మీడియాలో హైలెట్ గా చూపించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన మోడీ.. ఓటు వేసి తన బాధ్యతను నెరవేర్చానన్నారు. సొంత రాష్ట్రంలో ఓటు వేయడం కుంభమేళాలో పాల్గొన్నంత సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

మోడీ ఓటు వేయడంలో కూడా తన సింప్లిసిటీని మీడియా సాక్షిగా బయటపెట్టుకోవడం విశేషం. సాధారణంగా దేశానికి ప్రధానులు వీఐపీ ప్రొటోకాల్ ప్రకారం త్వరగా ఓటు వేసి పంపిస్తారు. భద్రతా కారణాల దృష్ట్యా క్యూలో నిలబడేందుకు దేశ సెక్యూరిటీ బలగాలు అనుమతించవు. కానీ ఎన్నికల వేళ మోడీ తనపై సానుభూతి-  సింప్లిసీటీని చాటేందుకు ఇలా సాధారణ పౌరుడిలా క్యూలో నిల్చున్నారు. సంక్షేమం - అభివృద్ధి కంటే సొంత ఇమేజ్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టే మోడీ.. ఓటేయడాన్ని కూడా దానికి వాడుకోవడం విశేషం.
Tags:    

Similar News