• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్లీజ్ మమ్మల్ని అలా...

ప్లీజ్ మమ్మల్ని అలా పిలవద్దు.. ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిల విన్నపం !

By - Tupaki Desk
Update: 2020-03-17 11:45 GMT
కరోనా ... చైనాలోని వూహాన్ పట్టణం లో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని గజగజ వణికిస్తోంది. అప్పటి నుంచి చైనీయులు ఎక్కడ కనిపించినా.. వారిని అంటరాని వాళ్లలా చూస్తూ దూరం పెడుతున్నారు. అయితే చైనాలో మొదలైన కరోనా వ్యాధి .. ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు శాపంగా మారింది. వారికి కరోనా లక్షణాలు లేకుండా మన సమాజం నుంచి వివక్షత ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు. తమను కరోనా అంటూ పిలవద్దంటూ కొంత మంది విద్యార్థులు ప్రజలను విన్నవించుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈశాన్య రాష్ట్రాలు చైనాను ఆనుకొని ఉండటం తో వారంతా చైనీయులను పోలి ఉంటారు. దీని కారణంగా ప్రజలు వారిని చైనా వారిగా అనుమానిస్తున్నారు. దీంతో తాము చదువుకునే ప్రాంతాల్లో, పని చేసే ప్రాంతాల్లో ఉండటానికి ఇల్లు కూడా అద్దెకు ఇవ్వడం లేదట. అంతటి తో ఆగకుండా వారిని కరోనా.. కరోనా అంటూ కొంత మంది పిలుస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఈ వీడియోలో పేర్కొన్నారు. కొన్ని రోజులుగా పంజాబ్ రాష్ట్రంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలిపేందుకు ఇలా ఆ విద్యార్థులు అంతా కలిసి ఒక వీడియోలో తమ ఆవేదన పంచుకున్నారు. చైనీయులుగా ఉన్నామంటూ తమను దూరం పెడుతున్నారని, స్నేహితులు కూడా తమను దగ్గరకు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తామంతా చైనా వాళ్లం కాదని.. తమపై వివక్ష చూపొద్దంటూ వాపోయారు. మేం స్వచ్ఛమైన భారతీయులం. మమ్మల్ని చైనీయులుగా భావించకండి అంటూ వారి అవేదన తెలియజేసారు.
Tags:    
  • Political News 
  • Breaking News 
  • Latest News 
  • Tupaki News 
  • Tupaki Latest News 
  • Tupaki Updates 
  • corona 
  • northeastren students 
  • punjab 

Similar News

ఏపీకి వరస తుఫానులు ఎందుకు వస్తున్నాయి ?

2026-11-17 17:42 GMT

ఇతను టఫ్ గాయ్.. ట్రంప్ పొగిడినా పట్టించుకోని మోడీ.. అసలేం జరిగింది?

2026-11-17 17:41 GMT

ట్రావిస్ హెడ్ కు గుడ్ బై చెప్పిన కావ్య పాప.. ఐపీఎల్ 2027 వేలంలో స్టార్లను వదిలేసిన ఫ్రాంచైజీలు

2026-11-17 17:40 GMT

సచిన్‌తో క్రికెట్.. ఆటో డ్రైవింగ్: అదరగొట్టిన విలియం, కేట్!

2026-11-17 17:38 GMT

పాలకులకు 'ఎల్ నినో' దడ.. 2004 నాటి చరిత్ర మళ్లీ రిపీట్ కానుందా?

2026-11-17 17:38 GMT

జమిలితో బీజేపీ : తెలంగాణాను ఎగరేసుకుపోతారా ?

2026-11-17 17:37 GMT

544 పేజీల సోనియా ఆత్మకథతో దేశానికి ఒరిగేదేంటి ?

2026-11-17 17:35 GMT

60 వేల మంది తొలగింపు.. మైక్రోసాఫ్ట్ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి?

2026-11-17 17:34 GMT

కొబ్బరికాయ కోసం రూ.2.50 లక్షలు ఖర్చు.. దీని కథేంటి తెలుసా?

2026-11-17 17:33 GMT

వర్కౌట్స్ తో తెగ కష్టపడిపోతున్న రాశీ ఖన్నా.. వీడియో వైరల్!

2026-11-17 17:33 GMT

చైర్మ‌న్ గిరి.. అంత ఈజీ కాదు ..!

2026-11-17 13:09 GMT

ఏపీలో జ‌డ్పీ పీఠాల‌పై చిక్కుముడులు.. రీజ‌నేంటి.. ?

2026-11-17 13:07 GMT

Copyright @2026

Powered by Blink CMS