లారీ డ్రైవర్స్ కార్డ్స్ ఆడి 38మందికి అంటించారు

Update: 2020-04-26 11:08 GMT
ఇటు వేసవి.. అటు కరోనా తో వచ్చిన లాక్ డౌన్ తో అందరూ ఇళ్లలోనే ఉండిపోతున్నారు. చేసుకోవడానికి పనుల్లేవు.. చేద్దామన్నా బయటా అంతా బంద్. దీంతో పోద్దుపోని వారంతా ఇప్పుడు పల్లెల్లో కొత్త వ్యాపకాలు పెట్టుకుంటున్నారు.

తాజాగా పల్లెల్లో పేకాట ఆడటం ఎక్కువైపోయిందట.. అందరూ ఇదే పనిగా పెట్టుకుంటున్నారట.. పోలీసులకు సమాచారం అందడంతో ఈ పేకాట ఆడుతున్న వారిని పెద్ద ఎత్తున పట్టుకుంటున్నారు. వీళ్లను కరోనా భయంతో ప్రస్తుతానికి స్టేషన్లకు తీసుకెళ్లడం లేదు. కేసులు పెట్టి వదిలేస్తున్నారు.

ఇక పేకాట డబ్బులను స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు.. ఊరంతా తిప్పి వారికి కౌన్సిలింగ్  ఇచ్చి వదిలేస్తున్నారట.. రెండు రోజుల తర్వాత స్టేషన్ కు వచ్చి కలవాలని సూచిస్తున్నారు. చాలా చోట్ల సీమ సహా కోస్తా జిల్లాల్లో ఇప్పుడు పేకాట ఆట తీవ్రంగా సాగుతోందట..

కాగా విజయవాడలో  ఓ లారీ డ్రైవర్ తనకు కరోనా ఉందన్న విషయం తెలియకుండా ఇలానే చాలా మందితో పేకాట ఆడి ఏకంగా 38మందికి కరోనా అంటించాడట.. ఇలా పేకాట ఆడడం కేవలం వినోదానికే కాదు.. కరోనా వ్యాప్తికి కారణమవుతోంది.
Tags:    

Similar News