2025 డైరీ: చంద్రబాబులో కొత్త షేడ్స్!
ఈ ఏడాది ఏపీలో చోటు చేసుకున్న కీలక పరిణామాల్లో సీఎం చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఆయన చూపిన దూకుడు.. ప్రజలకు చేరువ అయిన విధానం నభూతో.. అనే చెప్పాల్సి ఉంటుంది.;
ఈ ఏడాది ఏపీలో చోటు చేసుకున్న కీలక పరిణామాల్లో సీఎం చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఆయన చూపిన దూకుడు.. ప్రజలకు చేరువ అయిన విధానం నభూతో.. అనే చెప్పాల్సి ఉంటుంది. సహజంగా ముఖ్యమంత్రి అంటేనే బిజీగా ఉంటారు. ఇక, విజన్ సాకారం చేసుకునే దిశగా అడుగులు వేసే చంద్రబాబు అయితే.. మరింత బిజీగా ఉంటారు. కానీ.. తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. చంద్రబాబు ప్రతినెలా రెండు సార్లు.. ప్రజల మధ్యకు వెళ్తున్నారు. ఆప్యాయంగా పలకరిస్తున్నారు. కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. వారితో మమేకం అవుతున్నారు. తద్వారా.. ప్రజల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటున్నారు.
2) మోడీపై ప్రశంసలు: కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ.. ఇప్పుడు అదే పార్టీకి వెన్నుదన్నుగాఉన్న విషయం తెలిసిందే. కేంద్రంలో మోడీ సర్కారు నిలబడేందుకు టీడీపీనే ప్రధాన ఆక్సిజన్ అందిస్తోంది. అయినప్పటికీ.. చంద్రబాబు మాత్రం ప్రధాని నరేంద్ర మోడీవిషయంలో నాలుగు అడుగులు ముందు వేస్తున్నారు. ఆయనతో సంబంధాన్ని మరింత గాఢంగా పెంచుకునేందుకు ప్రయత్నించారు. ఈ సంవత్సరంలో మొత్తంనాలుగు సార్లు ప్రధానిని ఏపీకి ఆహ్వానించారు. నిజానికి 2014-18 మధ్య కూడా.. టీడీపీ-బీజేపీల మధ్య పొత్తు ఉన్నా.. దానికి భిన్నంగా ఇప్పుడు చంద్రబాబు కొత్త రూట్‌ను ఎంచుకున్నారు.
3) పాలన పరంగా..: పాలన పరంగా చంద్రబాబు చాలా సరికొత్త పుంతలు తొక్కుతున్నారనే చెప్పాలి. అటు ప్రభుత్వ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ.. వాటి అమలుపై దృష్టిపెడుతున్నారు. ప్రతిమూడు నెలలకు ఒకసారి.. కలెక్టర్ల సదస్సుతోపా టు.. ప్రతి 15 రోజులకు ఒకసారి మంత్రి వర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తద్వారా ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య వారధి వంటి ఈ రెండు వ్యవస్థలను సమన్వయం చేస్తున్నారు. ఇక, వాట్సాప్ పాలన, ఆర్టీజీఎస్ వంటి వ్యవస్థలతో ప్రభుత్వ సంక్షేమ పథకా లను ప్రజలకు చిటికెలో చేరవేస్తున్నారు. సూపర్ సిక్స్ వంటి ఎన్నికల హామీలతోపాటు.. చెప్పనివి కూడా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆటోవాలాలు, పాస్టర్లు, మహిళలకు ఈ పథకాలు అందేలా చేస్తున్నారు. 2047 విజన్ తో ముందుకు సాగుతూ.. కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంచుతున్నారు.
4) పార్టీ పరంగా.. : ఈ విషయంలోనూ చంద్రబాబు గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. గతంలో పార్టీ అధికారంలో ఉన్న ప్పుడు.. నాయకులను పట్టించుకునే వారుకాదు. దీంతో పార్టీ దెబ్బతింది. ఈ నేపథ్యంలో తాజాగా పార్టీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి శనివారం పార్టీ కేంద్రకార్యాలయానికి వెళ్లి నాయకుల పరిస్థితిని వాకబు చేస్తున్నారు. తప్పులు సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు. నాయకులను గాడిలో పెడుతున్నారు. ప్రభుత్వానికి-పార్టీకి మధ్య వారధులు నిర్మిస్తున్నారు. ఇదేసమయంలో పదవుల నియామకంలోనూ నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా.. పార్టీ విషయంలోనూ ఈ ఏడాది చంద్రబాబు చాలానే చర్యలు తీసుకున్నారు. మొత్తంగా.. చంద్రబాబుకు 2025 సూపర్ సక్సెస్ తీసుకువచ్చిందనే చెప్పాలి.