కేసీఆర్‌పై ఉద్య‌మ‌కారుల వ్య‌తిరేక‌త‌ను బ‌య‌ట‌పెట్టిన పీకే!?

Update: 2022-03-07 08:30 GMT
ఉద్యమం ద్వారా సాధించుకున్న తెలంగాణ‌లో వ‌రుస‌గా రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్‌పై ఆ ఉద్య‌మ కారుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. పార్టీలోనే వాళ్లు ఉన్న‌ప్ప‌టికీ సీఎం కేసీఆర్ తీరుపై సంతోషంగా లేరు.

తెలంగాణ అంత‌టా ఇదే ప‌రిస్థితి ఉంది.. ఇవి ఎవ‌రో అంటున్న మాట‌లు కావు. టీఆర్ఎస్ కోసం రంగంలోకి దిగిన ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ (పీకే) టీమ్ స‌ర్వే చెబుతున్న మాట‌లు. పీకే బృందం చేప‌ట్టిన స‌ర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఇప్ప‌టికే టీఆర్ఎస్ అధిష్ఠానానికి పీకే టీమ్ ఈ రిపోర్ట్ అంద‌జేసింది.

టీఆర్ఎస్ గురించి జ‌నం ఏమ‌నుకుంటున్నారు? ప‌థ‌కాల‌పై అభిప్రాయాలేంటీ? ఉద్య‌మ కారులు యాక్టివ్‌గానే ఉన్నారా? జ‌నం మూడ్ ఎలా ఉంది? త‌దిత‌ర విష‌యాల‌పై పీకే టీమ్ స‌ర్వే చేసింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ వైఖ‌రిపై సీఎం కేసీఆర్ తీరుపై ఉద్య‌మ‌కారులు తీవ్ర అసంతృప్తితో  ఉన్న‌ట్లు వెల్ల‌డైంద‌ని స‌మాచారం.

తెలంగాణ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయ‌కుండా పోరాడిన వాళ్ల‌ను వ‌దిలేసి.. ప్ర‌త్యేక రాష్ట్రానికి వ్య‌తిరేకంగా మాట్లాడిన వాళ్ల‌ను పార్టీలో చేర్చుకుని అంద‌లం ఎక్కించ‌డం ఉద్య‌మకారుల‌కు న‌చ్చ‌డం లేదు. 2014లో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను దెబ్బ కొట్టేందుకు కేసీఆర్  వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించారు. అలా ఉద్య‌మ నాయ‌కుల‌తో పోలిస్త కాంగ్రెస్, టీడీపీ నుంచి వ‌చ్చిన వాళ్ల‌కే ప‌ద‌వులు ద‌క్కాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

 ఇప్ప‌టీకి త‌మ‌ను కేసీఆర్ ప‌ట్టించుకోవ‌డ లేద‌ని కొంత‌మంది ఉద్య‌మ‌కారులు ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది. ఉద్య‌మ స‌మ‌యంలో ఆర్థికంగా న‌ష్ట‌పోయిన వాళ్ల‌కు ఎలాంటి సాయం అంద‌లేద‌ని తెలిసింది. అప్పుడు టీఆర్ఎస్ త‌ర‌పున పోరాడినందుకు ప‌ద‌వుల్లో ఉండి కేసులు పెట్టిన నేత‌లే.. ఇప్పుడు సొంత పార్టీలో త‌మ కంటే పై స్థాయిలో ఉండ‌డాన్ని వాళ్లు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

ప్ర‌తి చిన్న ప‌ని కోసం వాళ్ల ద‌గ్గ‌ర‌కు వెళ్లాల్సి వ‌స్తుంద‌ని వాపోతున్నారు. పోరాటంలో కొట్లాడినా ఇప్పుడు సొంత పార్టీలోనే గుర్తింపు లేద‌ని గుస్సా అవుతున్నారు. దీంతో పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ ఉద్య‌మ‌కారులు యాక్టివ్‌గా లేర‌ని తెలిసింది. త‌మ కోసం అధిష్ఠానం ఏం చేయ‌లేదనే అసంతృప్తి వాళ్ల‌లో ఉంది.
Tags:    

Similar News