కేటీఆర్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ అందుకేనా?
జాతీయ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి మిత్రులు దూరమైపోతున్నారు. శత్రువులు పెరిగిపోతున్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీపై వ్యతిరేకత పెరిగిపోతోంది. 2023 ఎన్నికల్లో దాన్ని క్యాష్ చేసుకోవడానికి కాంగ్రెస్ కు శక్తి చాలడం లేదు. అందుకే దేశంలో మూడో ఫ్రంట్ దిశగా అడుగులు పడుతున్నాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది. దీనికి బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజం వేస్తున్నట్టు కనిపిస్తోంది.
దేశంలోనే టాప్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా పలు బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి పనిచేస్తున్నారు. తమిళనాడులో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీలకు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. కర్ణాటకలో కుమారస్వామిని కూడా ప్రశాంత్ కిషోర్ తన కూటమిలో చేర్చుకునే అవకాశం ఉంది. ప్రశాంత్ కిషోర్ జట్టు మాజీ సభ్యుడు రాబిన్ ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నారు. కేసీఆర్, చంద్రబాబు చెప్తే కుమారస్వామి వినే అవకాశాలు చాలా ఉన్నాయి.అందుకే.. జాతీయ స్థాయిలో బలమైన సమాఖ్యను ఏర్పాటు చేయడానికి తగిన ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు అర్థమవుతోంది.
ప్రశాంత్ కిషోర్ పక్కా ప్రణాళిక తో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల వేదికను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలుచేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్‌తో సమావేశమైనట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసే దిశగా ప్రశాంత్ కిషోర్ ముందుకు సాగుతున్నారట. అందుకే కేటీఆర్‌ను మీట్ అయినట్లు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో తాను కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కేసీఆర్ ఎప్పటినుంచో చెప్పుకొస్తున్నారు. అంతకుముందే ఆయన మమతా బెనర్జీ, స్టాలిన్, కుమార స్వామి వంటి నేతలనూ కలిశారు. వివిధ కారణాలతో ఆయన తన ప్రయత్నాలను మానుకున్నారు.
ఇప్పుడు తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ పుంజుకుంటోంది. దీంతో బీజేపీనే ప్రధాన ప్రత్యర్థిక భావిస్తోంది అధికార టీఆర్‌ఎస్ పార్టీ. కాంగ్రెస్ పని ఖతమైందని అంచనాకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో తన వేదికలో లేదా కూటమిలో టీఆర్‌ఎస్ కూడా భాగస్వామిని చేయడానికి ప్రశాంత్ కిషోర్ రిషితో కేటీఆర్‌ఎస్ కలిసినట్లుగా వినిపిస్తోంది.
ఈ రిషి ప్రశాంత్ కిషోర్ జట్టులోని కీలక సభ్యుడు. రిషి పెళ్లి రిసెప్షన్‌కు వైఎస్ జగన్ తన సతీమణి భారతితో కలిసి హాజరయ్యారు. దీంతో ప్రశాంత్ కిషోర్‌తో జగన్ బంధం కొనసాగుతూనే ఉంది. మరోవైపు జగన్ ను చూస్తే అటు కేంద్రంలోని బీజేపీ తో సఖ్యత తో ఉంటున్నారు. అలాగనీ ప్రశాంత్ కిషోర్ ను వదులుకునేందుకు సిద్ధంగా లేరనేది తెలుస్తోంది. గత ఎన్నికల్లో జగన్ కు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త గా పని చేసి అధికారం లోకి రావడానికి హెల్ప్ చేశారు కాబట్టి.