రేవంత్ కు రాహుల్ ఆఫీస్ నుంచి ఫోన్? ఇదేమీ గోల!
ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే.. ఇంకేదో కాలి మరొకరు శోకాలు పెట్టారంట.. ఓ వైపు దేశంలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు తీసికట్టుగా మారి.. కాంగ్రెస్ సీనియర్లు అంతా కూడబలుక్కొని అధినేత్రి సోనియాగాంధీపై తిరుగుబావుట ఎగురవేసిన వేళ.. హైదరాబాద్ నుంచి ఢిల్లీ పెద్దలకు మెసేజ్ లు, ఈమెయిల్స్ వెల్లువెత్తాయంట.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సెగలు కక్కుతున్న వేళ మెసేజ్ లు పంపించిన సదురు నేతకు బాగానే వాయింపులు పడ్డాయని ఇన్ సైడ్ టాక్..
తెలంగాణలో ఉప ఎన్నికలకు వేళైంది. త్వరలో సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీకి ఉప ఎన్నిక వస్తోంది. అప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిని డిసైడ్ చేస్తే కాంగ్రెస్ లో ఉత్తేజం ఉత్సాహం వస్తుందని అంతా అనుకున్నారు. కానీ మొన్న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అందరినీ నిరాశపరిచింది. ఆ సమావేశం వాడివేడిగా జరుగుతుంటే తెలంగాణ నుంచి వర్కింగ్ కమిటీ సభ్యులకు ఒకటే ఎస్ఎంఎస్ లు, ఈమెయిల్స్ వెళ్లాయంట..
తెలంగాణలో ‘రేవంత్ కే మా ఓటు.. వీ ఓట్ ఫర్ రేవంత్’ అని మెసేజ్ లు, ఈమెయిల్స్ విపరీతంగా రాహుల్ గాంధీ ఆఫీసుకు.. ప్రియాంకాగాంధీ ఆఫీసుకు.. సీడబ్ల్యూసీ మెంబర్స్ కు మోత మోగాయంట.. అవన్నీ రేవంత్ రెడ్డికి అనుకూలంగానే ఉన్నాయట.. ఇవి తట్టుకోలేక రాహుల్ ఆఫీస్ నుంచి రేవంత్ కు ఫోన్ వచ్చిందట.. ఇందంతా ఏంటని.. మాస్ గా వస్తున్నాయని.. మీటింగ్ జరిగేది తెలంగాణ అధ్యక్షుడి గురించి కాదని.. మీ గోల ఏంది అని ఫోన్ లు వచ్చాయని కాంగ్రెస్ వర్గాల్లో ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారిందట..