• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చంద్రబాబును రాళ్లతో...

చంద్రబాబును రాళ్లతో కొట్టి చంపాలన్న జగన్ సంస్కారమేంది నాని?

By - Tupaki Desk
Update: 2021-09-30 04:47 GMT
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అరేయ్.. ఓరేయ్ లాంటి మాటలు మాట్లాడింది లేదు. ఆ మాటకు వస్తే.. అమర్యాద కలిగేలా వ్యాఖ్యలు చేశారే కానీ.. అన్ పార్లమెంటరీ పదాల్నిఅయితే ప్రయోగించింది లేదు. ఎందుకంటే.. పవన్ మాట్లాడిన అన్ని ప్రసంగాలకు సంబంధించిన వీడియోలు ఆన్ లైన్ లో అందుబాటులోనే ఉన్నాయి.

ఒక రాష్ట్ర మంత్రిని ఉద్దేశించి ‘సన్నాసి’ అంటారా? అంటూ గుండెలు బాదేసుకునే వారు.. మంత్రిగా వ్యవహరించిన వేళలో లోకేశ్ ను పప్పు అంటూ ఎంతలా ఎటకారం చేసింది? ఎంతలా చులకన చేసింది అందరికి తెలిసిన విషయమే. మరి.. అలాంటి వేళలో.. మంత్రి పదవిలో ఉన్న లోకేశ్ మీద అంత దారుణ రీతిలో వ్యాఖ్యలు చేస్తారా? ఆయన గౌరవాన్ని తగ్గించేలా వ్యాఖ్యలు చేసే వారిపై ఎవరూ ఎందుకు మాట్లాడలేదు? అన్నది ఒక ప్రశ్న అయితే.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపైన నాటి విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. బాబును ఉద్దేశించి.. ‘ప్రజలు రాళ్లతో కొట్టి చంపాలి’ అన్న వ్యాఖ్య చేయటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.

ముఖ్యమంత్రిని ఉద్దేశించి అలా మాట్లాడతారా? ఇలా మాట్లాడతారా? అంటూ నీతులు చెబుతున్న మంత్రి నాని.. నాడు జగన్మోహన్ రెడ్డి నాటి ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడిన విషయం మాటేమిటి? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. తమను ఎవరూ ఏమీ అనకూడదని..తాము మాత్రం ఎవరినైనా ఎంత మాట అయినా అనేస్తామన్న మైండ్ సెట్ లో ఉండటం సరికాదంటున్నారు.

నాడు తిట్లు తిట్టినప్పుడు.. విపక్షం అన్నాక విమర్శలు చేయకుండా ఉంటుందా? అన్న సమర్థింపు మాటలు చెప్పిన వారు..ఇప్పుడేమో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి అంత తీవ్ర పదాల్ని ఎలా వాడతారంటూ నీతులు వల్లిస్తున్న నాని లాంటి వారి కారణంగా..పార్టీకి జరిగే నష్టం అంతా ఇంతా కాదన్న మాట వినిపిస్తోంది. మరి.. పలువురు సంధిస్తున్న ఈ తరహా ప్రశ్నలకు పేర్ని నాని స్పందించి సమాధానం చెబుతారా?
Tags:    
  • Ycp Party 
  • Andhra Pradesh 
  • pawan kalyan comments 
  • perni nanitdp party 
  • perni nani comments 
  • Ap cm jagan mohan reddy 
  • chandra babu naidu 

Similar News

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

Copyright @2026

Powered by Blink CMS