ఆ సిటీలో 11 వేల మంది కరోనా బాధితులు బయటే తిరుగుతున్నారట !

Update: 2020-07-25 11:50 GMT
దేశంలో కరోనా తీవ్రత ఇంతలా పెరిగిపోతున్నా కూడా ఇంకా కొంతమంది నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. క‌రోనా సోకిన వారు చికిత్స తీసుకోకుండా , బయటే తప్పించుకు తిరుగుతున్నారు. ఈ పద్దతి వల్ల వారితో పాటుగా వారితో సన్నిహితంగా మెలిగేవారికి కూడా ప్రమాదమే. క‌రోనా పాజిటివ్ అని స్పష్టంగా తెలిసిన తరువాత కూడా చికిత్స కోసం హాస్పిటల్ లో చేరకుండా, బయటే తిరుగుతూ ప్ర‌జ‌లంద‌రినీ భ‌య‌ భ్రాంతుల‌కు గురి చేస్తున్నారు. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన మహానగరాలలో ఒకటైన బెంగ‌ళూరులోనే ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి అంటేనే పరిస్థితి ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు.

క‌రోనా వ్యాధి లక్షణాలు టెస్టుల‌కు వ‌చ్చి, ఆ త‌ర్వాత బీబీఎంపీ సిబ్బందికి అందుబాటులో లేకుండా పోయిన వారి సంఖ్య ఏకంగా 11 వేల వరకు ఉందట. వారందరికీ కరోనా పాజిటివ్ అని తేలిందట. దీనితో వారి గురించి ఎంక్వయిరీ చేస్తే చాలా మంది ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు, మ‌రి కొంద‌రు త‌ప్పుడు నంబ‌ర్ల‌ను ఇచ్చారు, ఇంకొంద‌రు తప్పుడు అడ్ర‌స్ ఇచ్చి , వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలుసుకోవడానికి వీలులేకుండా చేసారు. వీళ్లు టెస్టుల‌కు వ‌చ్చిన‌ప్పుడే రాంగ్ నంబ‌ర్లు ఇవ్వడం, అడ్ర‌స్ లు త‌ప్పు చెప్ప‌డం వంటి ప‌నులు చేశార‌ని తీరా టెస్టులు పూర్త‌య్యాకా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని బీబీఎంపీ ప్రకటించింది.

మొత్తంగా చూస్తే , బెంగ‌ళూరులో రోజువారీగా క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. రోజుకు 1500 స్థాయిలో కూడా కేసులు న‌మోదు అయ్యాయి. ఈ నేప‌థ్యంలో కరోనా లక్షణాలు తో టెస్టుల‌కు వ‌చ్చిన వాళ్లు భాద్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని బీబీఎంపీ వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. క‌రోనా పాజిటివ్ అని తేలితే త‌మ‌ను ఎక్క‌డ ఆసుప‌త్రికి తీసుకెళ్లిపోతారో, చుట్టుప‌క్క‌ల వాళ్లు ఎక్క‌డ వివ‌క్ష‌తో చూస్తారో అని బయపడి వాళ్లు నెంబర్ తప్పుగా ఇవ్వడం కానీ, అడ్రస్ తప్పుగా ఇవ్వడం కానీ చేస్తున్నారు. అలా ఇప్పటివరకు మొత్తంగా కంగా 11 వేల మంది త‌ప్పుడు నంబ‌ర్ల‌ను, త‌ప్పుడు అడ్ర‌స్ ల‌ను ఇచ్చారంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఇకపోతే కర్ణాటకలో ఇప్పటివరకు మొత్తంగా 85 వేలకి పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో అత్యధిక కేసులు ఉన్న రాష్ట్రాల జాబితాలో 4 వ స్థానంలో ఉంది.
Tags:    

Similar News