రాధాను పవన్ పిలవలేదే.. టీడీపీ గాలం

Update: 2019-01-22 04:38 GMT
తెలంగాణతో పోలిస్తే. ఏపీలో కుల రాజకీయాలు బాగా ఉంటాయన్నది జగమెరిగిన సత్యమే.. కమ్మలు టీడీపీకి, రెడ్లు వైసీపీ వెంట నడుస్తున్నారు. ఇక ఏపీలో సింహ భాగం ఉన్న కాపులో పోయిన సారి పవన్ వల్ల టీడీపీకి మద్దతివ్వడంతో ఆ పార్టీ విజయం సాధించింది. ఈసారి కాపులు ఎటువైపు నిలుస్తారో వారికి కొంచెం విజయావకాశాలు పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో కూడా కాపులకే పెద్దపీట వేశారు. జనసేన నిర్వాహకుల్లో ఎక్కువమంది కాపులే ఉన్నారు. ఈసారి ఆయన ఎవరికి మద్దతిస్తాడన్నది అంతుబట్టడం లేదు. అయితే విజయవాడ రాజకీయాలను ఒంటి చేత్తో ఒకప్పుడు ఏలిన వంగవీటి రాధా ఇటీవల వైసీపీ నుంచి టికెట్ గొడవల్లో బయటకు వచ్చేశారు. ఆయన జనసేనలో చేరుదామని ఆశించారు. అదే సామాజికవర్గం కావడంతో పవన్ పిలుస్తాడని ఆశించారు. కానీ ఇప్పుడు జనసేన నుంచి ఏ పిలుపు లేకపోవడంతో డైలామాలో పడ్డట్టు తెలిసింది.

జనసేనని కుల సెంటిమెంట్ ను, రాధాను పట్టించుకోకపోవడంతో ఇప్పుడు రాధాకు గాలం వేయడానికి టీడీపీ ఓ సీనియర్ ఐపీఎస్ ను రంగంలోకి దింపుతున్నారు. గడిచిన రెండు ఎన్నికల్లో టికెట్ ఇచ్చిన గెలవని రంగా ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకంటే ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని టీడీపీ ఆఫర్ ఇచ్చిందట.. తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి లేదా.. కార్పొరేషన్ పదవి ఇచ్చేందుకు టీడీపీ ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. రెండు సార్టు ఎమ్మెల్యేగా ఓడిన రాధాకు ఇదే సేఫ్ జోన్ అని నచ్చచెప్పుతున్నట్టు సమాచారం.

రాధాను పవన్ వదలుకోవడం.. దాన్ని టీడీపీ అందిపుచ్చుకోవడం జరిగిపోతోంది. ఏ అవకాశాన్ని వదలని బాబు.. రాధాను ఆకర్షిస్తున్నారు. ఆయన్ను టీడీపీలోకి రప్పించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపుల ఓట్లకు గాలం వేయడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయో చూడాలి మరి..
    



Full View
Tags:    

Similar News