దసరా తర్వాత బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ ఫస్ట్ మీటింగ్..ఆ సిటీలోనా?
ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించేందుకు బీజేపీ-జనసేన రెడీ అవుతోంది. పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తాడన్న విమర్శలున్న పవన్ కళ్యాణ్ ను బేస్ చేసుకొని బీజేపీ రెచ్చిపోవాలని ప్లాన్ చేస్తోంది. టీడీపీని తుత్తునియలు చేస్తూ అధికార వైసీపీని ఢీకొట్టే వ్యూహాలు రచిస్తోంది. వచ్చే దసరాకే ముహూర్తం పెట్టారంట.. అదీ మన సీఎం జగన్ కలల రాజధాని నుంచే.. మరి బీజేపీ-జనసేన చేస్తున్న ప్లాన్ ఏంటి? అక్కడ ఏం చేస్తారు? ఎలా ముందుకెళుతున్నారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా సోము వీర్రాజు-పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆ ప్లాన్లు హాట్ టాపిక్ గా మారాయని అంటున్నారు.
ఏపీ రాజకీయ తెరపై సూపర్ జోడి సెట్ అయ్యింది. ఓ వైపు జనసేనాని పవన్ కళ్యాణ్.. మరోవైపు ఫైర్ బ్రాండ్ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజులు కదనోత్సాహంతో ఉన్నారు. బీజేపీ-జనసేన ఇద్దరు కలిసి బలోపేతం కావాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారట.. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు ప్లాన్ చేశారని.. ఉమ్మడి కార్యక్రమాలతో ముందుకెళ్లాలని చూస్తున్నారట..!
అందులో భాగంగానే కరోనా తగ్గితే దసరా తర్వాత పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేయాలని.. దానికి ఒక బహిరంగ సభ పెట్టి జాతీయ నేతలను పిలిపించి వైసీపీ మీద దుమ్మెత్తి పోయాలని ఆలోచన చేస్తున్నారట.. ఈ మేరకు జనసేన ఆఫీసులో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయంట..
ఉత్తర భారత కల్చర్ అధికంగా ఉండే విశాఖనే జనసేన-బీజేపీ సమరానికి తొలి వేదికగా నిర్ణయించుకున్నారట.. ఎందుకంటే ఇక్కడ వైసీపీ గౌరవ అధ్యక్షురాలైన వైఎస్ విజయమ్మ సైతం ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. అంతేకాదు.. వైసీపీ అధిష్టానంలో నంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి అడ్డాగా ఉన్న వైజాగ్ లోనే సమరశంఖం పూరించాలని రెండు పార్టీలు పట్టుదలగా ఉన్నాయట.. పెద్ద ఎత్తున ఇక్కడ సభ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాయట..
పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ పోటీచేసి ఓడిపోయిన విశాఖలోని గాజువాకలోనే ఈ సభ పెట్టాలని బీజేపీ-జనసేన ఆలోచన చేస్తున్నాయని సమాచారం అందుతోంది. మరి పవన్ కళ్యాణ్ ఇప్పటికే నాలుగు సినిమా అనౌన్స్ చేశాడు. వచ్చే రెండేళ్లు సినిమాలకే లాక్ అయ్యాడు. వరుసగా సినిమాల షూటింగ్ లు కూడా ఉన్నాయి. మరి పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటారో.. సినిమాల మీద కాన్ సన్ ట్రేషన్ చేస్తారో చూడాలని కొందరు అంటున్నారు.