"జగన్ తృప్తి కోసమైనా.. బాబుకు ఓటేయాలి"
ఈ క్రమంలో వారు చేస్తున్న వ్యాఖ్యలు.. అమరావతిపై వారు వేస్తున్న సెటైర్లను కోట్ చేస్తున్న పలువురు నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. కీలక పిలుపు కూడా ఇస్తున్నారు.;
"జగన్ తృప్తి కోసమైనా.. బాబుకు ఓటేయాలి"- ఈ మాట ఎవరో టీడీపీ నాయకులో కూటమి నాయకులో చెప్పడం లేదు. అనుకూల మీడియా కూడా ప్రచారం చేయడం లేదు. సోషల్ మీడియా జనాలు చెబుతున్న మాట.ఇస్తున్న నినాదం!. ఆశ్చ ర్యంగా అనిపించినప్పటికీ వాస్తవం!. జగన్ ప్రతిపాదించిన మావిగన్(మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు నగరాలను కలుపు తూ రాజధాని ఏర్పాటు ప్రతిపాదన)పై వైసీపీ నాయకులు వీడియోలు చేస్తున్నారు. మీడియాముందుకు వస్తున్నారు.
ఈ క్రమంలో వారు చేస్తున్న వ్యాఖ్యలు.. అమరావతిపై వారు వేస్తున్న సెటైర్లను కోట్ చేస్తున్న పలువురు నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. కీలక పిలుపు కూడా ఇస్తున్నారు. ``అమరావతి నిర్మాణం ఇప్పట్లో పూర్తికాదు. దీనికికనీసంలో కనీసం 2 లక్షల కోట్ల రూపాయలు కావాలి. అంత సొమ్ము ఎక్కడ నుంచి వస్తుంది. ఎవరు ఇస్తారు. దీనిని ఎలా తెస్తారో.. చంద్రబాబే చెప్పాలి. ఇది సాధ్యంకాదు కాబట్టే.. జగన్ 'మావిగన్' ప్రతిపాదన తెచ్చారు. ఇది చక్కటి కార్యక్రమం. దీనికి ప్రజల మద్దతు కూడా ఉంటుంది.`` అని వైసీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఇవే వ్యాఖ్యలు చేశారు.
వీటికి స్పందనగా నెటిజన్లు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ``అమరావతిని కట్టడం జగన్‌కు చేతకాదని చెబుతున్నారు.`` అని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు.. ``లక్షల కోట్ల రూపాయలు అవసరం లేదు బ్రో. అది స్వయం ఆదాయ స్ఫూర్తితో కడుతున్న నిర్మాణం బ్రో`` అని వ్యాఖ్యానించారు. ఇంకొందరు.. ``జగన్ ఎలానూ కట్టలేడు కాబట్టి.. అమరావతి నిర్మాణం పూర్తయ్యే వరకు అయినా..చంద్రబాబుకు ఓటేయాలి. ఆయన గెలిస్తే.. అమరావతి నిలుస్తుంది. అప్పుడు జగన్ నేర్చుకుంటాడు. జగన్ సంతృప్తి కోసమైనా..(అమరావతిని ఎలా కడతారో అనే) బాబుకు ఓటేయాలి`` అని వ్యాఖ్యానిస్తున్నారు.
వాస్తవానికి `మావిగన్` వ్యాఖ్యలపై నెటిజన్లు ఆసక్తిగా స్పందించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వ్యాఖ్యల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే..వైసీపీ వైపు నుంచి దీనిని ప్రమోట్ చేసేందుకు బలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మావిగన్‌పై వారు చేస్తున్న వ్యాఖ్యలకు నెటిజన్లు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ``జగన్ సంతృప్తి కోసమైనా.. చంద్రబాబు అమరావతిని పూర్తి చేయాలి`` అని కొందరు వ్యాఖ్యానించారు. ఆయనకు ఎలానూ కట్టడం రాదని.. కాబట్టి ఆ బాధ్యత పూర్తిగా చంద్రబాబుకు ఇవ్వాలంటే.. మరో మూడు సార్లు బాబే అధికారంలో ఉండాలని వ్యాఖ్యానించేవారు పెరుగుతున్నారు.