హోం మంత్రి అనిత ఇలాకాలో ముందస్తు సంబరాలు.. ఫేట్ మారితే.. ?
కానీ ఇప్పుడు జనాభా పరంగా చూసుకుంటే వలసల కారణంగా కావచ్చు లేకపోతే ఉద్యోగ పరంగా కావచ్చు ఇతర సామాజిక వర్గాలు ఈ నియోజకవర్గంలో పెరుగుతున్నాయి.;
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గం హార్ట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ అమలు జరిగితే పాయకరావుపేట నియోజకవర్గాన్ని మహిళల కోటాలో కేటాయిస్తారు అన్నది గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ఇటు సోషల్ మీడియాలోనూ అటు ప్రధాన మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టిడిపి సీనియర్ నాయకురాలు మంత్రి వంగలపూడి అనిత అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.
అయితే వాస్తవం ఎంత అనేది క్షేత్రస్థాయిలో చూడాల్సిన అవసరం ఉంది. పాయకరావుపేట నియోజకవర్గం ప్రస్తుతం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఉంది. అయితే ఇక్కడ నియోజకవర్గ పునర్విభజన జరిగితే పాయకరావుపేట ప్రాంతం రెండుగా విభజనకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ ఎస్సీల సంఖ్య కంటే కూడా ఇతర సామాజిక వర్గాల సంఖ్య పెరుగుతోంది. గత 15 సంవత్సరాల కిందట జరిగిన నియోజకవర్గ పునర్విభజనలో పాయకరావుపేట చిన్నచిన్న మార్పులతో మారింది.
కానీ ఇప్పుడు జనాభా పరంగా చూసుకుంటే వలసల కారణంగా కావచ్చు లేకపోతే ఉద్యోగ పరంగా కావచ్చు ఇతర సామాజిక వర్గాలు ఈ నియోజకవర్గంలో పెరుగుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల నాటికి అసలు ఈ నియోజకవర్గం ఎస్సీ కాకపోవచ్చు. దానికి తోడు నియోజకవర్గ విభజన కూడా జరగవచ్చు.. అనే చర్చ కూడా నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. ఒకవేళ మహిళలకు రిజర్వేషన్ కల్పించినప్పటికీ ఈ నియోజకవర్గంలో ఇలాగే ఉంటుందా లేకపోతే ముఖచిత్రం మారుతుందా అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
అలా చూసుకున్నప్పుడు మంత్రికి అనుకూలంగా ఓటు బ్యాంకు స్థిరంగా ఉంటుందా లేకపోతే మారుతుందా అనేది కూడా కీలక అంశం. కాబట్టి ఎలా చూసుకున్నప్పటికీ పాయకరావుపేటలో సంబరాలు చేసుకోవడం తప్పు కాదు కానీ ముందే ఊహించుకోవడం అనేది మంచిది కాదన్నది పరిశీలకులు చెబుతున్న మాట. రెండు రకాలుగా ఈ నియోజకవర్గ విభజనకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకటి జనాభాపరంగా. రెండు ఎస్సీ రిజర్వుడ్ పరంగా కూడా. ఈ నియోజకవర్గాన్ని విభజించే అవకాశం ఉంది.
అలా చూసుకున్నప్పుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనిత ఈ నియోజకవర్గంలో ఏ మేరకు పోటీ చేస్తారని ప్రశ్న. ఇప్పటివరకు ఎస్సీ నియోజకవర్గ కావడం ఆమెకు కలిసి వచ్చింది. రేపు జనరల్ కి మారితే ఒకవేళ మహిళా రిజర్వేషన్ ఉన్నప్పటికీ స్థానికంగా మరికొందరు మహిళా నాయకులు కూడా ఈ నియోజకవర్గం కోసం డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఎస్సీ రిజర్వుడు కాకపోతే అప్పుడు వంగలపూడి అనిత వేరే నియోజకవర్గానికి మారాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. కాబట్టి ఇప్పుడే సంబరాలు చేసుకోవడం తగ్గించి అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుందని పరిశీలకులు చెబుతున్న మాట.