• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నేతలకు పవన్ కళ్యాన్ బంపర్...

నేతలకు పవన్ కళ్యాన్ బంపర్ ఆఫర్

By - Tupaki Desk
Update: 2019-01-12 04:40 GMT
పదహేరేళ్ల వయస్సులోనే రౌడీలను తన్ని తరిమేశానని.. తాను ఒక్క సైగ చేస్తే కాళ్లు విరగొట్టి కూర్చోబెడతారని.. తాను ఆకు రౌడీలకు , గాలి రౌడీలకు భయపడే వ్యక్తిని కాదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులను వేధిస్తున్నాడని జన సైనికులు తాజాగా పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు ఆయన సీరియస్ గా స్పందించారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లా నేతలతో సమీక్ష సందర్భంగా మాట్లాడిన పవన్.. వేధిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసుపెట్టాలని నాయకులకు సూచించారు. ప్రభుత్వం దళితులను వేధిస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రజల కోసం ఎవరితోనైనా పెట్టుకుంటానని.. చింతమనేని లాంటివాళ్లను వెనకేసుకొస్తున్న టీడీపీకి అండగా ఎందుకుండాలని ప్రశ్నించారు.

టీడీపీ, వైసీపీ, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు జనసేన వైపు చూస్తున్నారని.. వారందరికీ స్వాగతం పలుకుతున్నామని జనసేనాని పవన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. పార్టీ సంస్థాగత నిర్మాణానికి సమయం ఆసన్నమైనందున పార్లమెంట్ స్థాయిలో కమిటీలు వేయాలని నిర్ణయించామని పవన్ చెప్పారు. దీని కోసమే జిల్లా సమీక్ష చేస్తున్నామన్నారు. ఏ పార్టీ నుంచి వచ్చినా చేర్చుకుంటామన్నారు.

మానవత్వం కోసం రాజకీయాల్లోకి వచ్చానని.. కులం, మతం, ప్రాంతీయతను నమ్ముకొని తాను రాజకీయాల్లోకి రాలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విభజించు, పాలించు సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నానన్నారు. బాబు, జగన్ రాజకీయ ప్రసంగాలతో విసిగిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు.

ప్రజారాజ్యం దెబ్బతిన్న తర్వాత తాను పార్టీ స్థాపించి ఇంత దూరం నడిపించడమే చాలా కష్టమైన పని అని పవన్ అన్నారు. నాయకులను నమ్మి పార్టీ పెట్టలేదని.. అభిమానులు, సాధారణ కార్యకర్తలని నమ్మే జనసేన స్థాపించానని చెప్పుకొచ్చారు. తాను ముఖ్యమంత్రిని కావడానికి రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.

డబ్బు లేదని పార్టీ నడపలేరని ఎద్దేవా చేస్తున్నారని.. కానీ డబ్బు కన్నా పార్టీ నడిపేందుకు గుండె దైర్యం కావాలని పవన్ స్పష్టం చేశారు. తాను బలంగా ఉన్నానని.. తనతోపాటు బలంగా పోరాడే వారికోసమే చూస్తున్నానని చెప్పారు. బాబుకు, లోకేష్ కు పుట్టగానే అనుభవం రాలేదని స్పష్టం చేశారు.  టీ ఎక్కువగా తాగుతానని.. ఆ టీ గ్లానే మన పార్టీ గుర్తయిందని.. మన ఆలోచన బలంగా ఉంటే అదే కలిసివస్తుందని తెలిపారు.

జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా విమర్శలు చేస్తానని.. టీడీపీ నేతలను తాను వ్యక్తిగతం ఎప్పుడూ విమర్శించలేదని పవన్ స్పష్టం చేశారు. నేతలకు బాధ్యతలపై త్వరలోనే నిర్ణయిస్తానని తెలిపారు.
    



Full View
Tags:    
  • Pawan Kalyan 
  • Janasena Party 
  • Telugu News 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS