• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  హైపర్ ఆదికి పవన్ బంపర్...

హైపర్ ఆదికి పవన్ బంపర్ ఆఫర్...?

By - Tupaki Desk
Update: 2023-01-14 02:30 GMT
హైపర్ ఆది. జబర్దస్త్ తో పేరు తెచ్చుకున్నాడు. అంతకు ముందు సాఫ్ట్ వేర్ ఇంజనీరు గా హైదరాబాద్ లో పనిచేశాడు. టాలెంట్ ఉంది, అది సరైన సక్సెస్ ఇచ్చింది. జబర్దస్త్ స్కిట్స్ తో హీరో వర్షిప్ సంపాదించుకున్న ఆది మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అని అందరికీ తెలిసిందే. ఆయన ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ గా మారిపోయారు.

దాంతో 2019 ఎన్నికల సమయంలో ఆయన తన తోడి జబర్దస్త్ నటులను తీసుకుని జనసేనకు అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. ఇక అది లగాయితూ జనసేన కోసం ఏమైనా చేయడానికి సిద్ధం అని ఆది చెబుతూ వచ్చాడు. ఇపుడు సడెన్ గా పవన్ కళ్యాణ్ శ్రీకాకుళంలో నిర్వహించిన సభలో ఆది మెరిసాడు. అంతే కాదు తనదైన స్టైల్ లో ఫన్నీగా మాట్లాడుతూ సభను ఉర్రుతలూగించారు.

ఆది కామెడీకి పంచులకు ఒక దశలో పవన్ కూడా నవ్వాపుకోలేక పదే పదే విరగబడి నవ్వారు. ఇక నాగబాబు సరేసరి. మొత్తనికి పవన్ని ఆకాశానికి ఎత్తేస్తూ వైసీపీ మంత్రుల మీద ఆది పేల్చిన డైలాగులు ఆటంబాబులనే తలపించాయి. పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని అడ్డుకోవాలని చూస్తే ఆయన పాదయాత్ర చేస్తారని అపుడు వైసీపీ మంత్రులకు కాశీయాత్రే అంటూ స్పాంటేనియస్ గా ఆది పేల్చిన డైలాగులు అదిరిపోయాయి.

ఇదిలా ఉంటే ఆది ఊరకే ఈ సభకు రాలేదు, పైగా తాను జనసైనికుడికి మాత్రమే కాదు జనసేన అభ్యర్ధిగా వచ్చాను అని మాట్లాడరు. అంటే వచ్చే ఎన్నికల్లో ఆది జనసేన తరఫున పోటీ చేస్తారు అని టాక్ నడుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఆది ఒంగోలు నుంచి కానీ లేక దర్శి నుంచి కానీ పోటీ చేయడానికి ఆసక్తితో ఉన్నారని అంటున్నారు

ఇక తెలుగుదేశం పార్టీ నుంచి పొత్తులలో భాగంగా ఈ రెండు సీట్లను జనసేన కోరుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఈ రెండు సీట్లలో కాపులు ఎక్కువగా ఉన్నారు. దాంతో ఆది ఇక్కడ నుంచి పోటీ చేస్తే సులువుగా గెలుస్తారు అని అంటున్నారు. మొత్తానికి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరు గా వృత్తిని చేపట్టి కళాకారుడిగా మారి జబర్దస్తు తో తెలుగు రాష్ట్రాలలో ఒక ఊపు ఊపేసిన ఆది ఇపుడు పొలిటీషియన్ గా టర్న్ అవుతున్నారు అని అంటున్నారు.

నిజానికి ఆదికి ఆ ఆలోచన లేకపోతే ఆయన జనసేన సభకు రారు అని అంటున్నారు. రాజకీయ సభకు రావడానికి కళాకారులు ఎవరూ పెద్దగా సుముఖత వ్యక్తం చేయరు. తమ కెరీర్ కి రాజకీయాలు అడ్డు అని భావిస్తారు. కానీ ఆది డేరింగ్ గా పవన్ వెంటే తాను అని నడుస్తున్నారు అంటే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారు అని అంటున్నారు. జబర్దస్త్ లో సైతం ఆయనకు నాగబాబు బాగా ప్రోత్సాహం అందించిన సంగతి తెలిసిందే. అలా ఆది ఇపుడు రాజకీయాల్లో కూడా రాణించేందుకు అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • jabardasth 
  • aadi 
  • janasena 
  • yuvashakthi 
  • pawankalyan 
  • latestnews 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS