అట్ట‌హాసంగా చేద్దామా.. ఈ సారికి వ‌దిలేద్దామా..? సీఎం పుట్టిన రోజు వేడుక‌పై త‌ర్జ‌న భ‌ర్జ‌న‌

Update: 2021-12-20 10:30 GMT
సీఎం జ‌గ‌న్ ఇంట్లో ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా.. అది వైసీపీ నేత‌ల‌కు పండ‌గే. ఎక్క‌డెక్క‌డ నుంచో నాయ‌కు లు.. త‌ర‌లి వ‌స్తారు. పుష్ప‌గుచ్ఛాలు ఇస్తారు. పెద్ద ఎత్తున సంబ‌రాలు చేస్తారు. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. సంద‌డే సంద‌డి. సీఎం జ‌గ‌న్ క‌న్నా.. ఎక్కువ‌గా సంబ‌రాల్లో మునిగిపోయే.. అప‌ర భ‌క్తులు వైసీపీకే సొంతం. ఈ క్ర‌మంలో తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ పుట్టిన రోజు వేడుక‌లు.. జ‌ర‌గ‌నున్నాయి. ఆయ‌న 50వ సంవ‌త్స‌రంలోకి అడుగు పెడుతున్నారు. అయితే.. దీనిని అట్ట‌హాసంగా చేయాల‌ని.. పార్టీ నాయ‌కులు నిర్ణ‌యించుకున్నారు.

ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఈ పుట్టిన రోజు వేడుక‌ను నిర్వ‌హించుకునేందుకు ఇప్ప‌టికే ఢిల్లీ నుం చి ఇత‌ర ప్రాంతాల నుంచి కూడా త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు చేరుకున్నారు. మంగ‌ళ‌వారం నిర్వ‌హిం చే జ‌న్మ‌దిన‌ కార్య‌క్ర‌మాన్ని..అట్ట‌హాసంగా చేయాల‌ని భావిస్తున్నారు.

అయితే.. ఇటీవ‌ల కొన్ని ఆదేశాలు వ‌చ్చాయి. ఏం చేయాల‌న్నా.. పార్టీకి సంబంధించి పార్టీ అధినేత కు సంబంధించి ఎలాంటి కార్య‌క్ర‌మం చేయాల‌న్నా.. పార్టీ అనుమ‌తి త‌ప్ప‌ని స‌రి.. అని నేత‌ల‌కు మౌఖికంగా.. ఆదేశాలు వెళ్లిపోయాయి. దీంతో ఇప్పుడు పుట్టిన రోజును ఎంత ఘ‌నంగా చేయాల‌నే విష‌యంపై.. త‌ర్జ‌న భ‌ర్జ‌న కొన‌సాగుతోంది.

కొంద‌రు నేత‌లు . ఇప్ప‌టికే స్టార్ హోట‌ళ్ల‌ను కూడాబుక్ చేసుకున్నార‌ని.. సంబ‌రాలు అంబ‌రాన్నంటేలా చేయాల‌ని భావిస్తున్నార‌ని..తాడేప‌ల్లికి వ‌ర్త‌మానాలు వెళ్లాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా తాడేప‌ల్లి నుంచి ఔన‌నికానీ, కాద‌ని కానీ.. ఎలాంటి సంకేతాలు వెళ్ల‌లేదు. ఎందుకంటే.. అట్ట‌హాసంగా చేసుకుంటే.. ప్ర‌జ‌లు ఒక‌ప‌క్క అనేక స‌మ‌స్య‌ల‌తో అల్లాడుతున్న స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజును అట్ట‌హాసంగా చేసుకుంటారా? అని ప్ర‌తిప‌క్షాలు కామెంట్లు చేసే అవ‌కాశం ఉంద‌ని సీఎంవో వ‌ర్గాలే భ‌య‌ప‌డుతున్నా యట‌.

పోనీ.. వేడుక‌ల‌కు దూరంగా ఉందామంటే.. అది కూడా రాంగ్ సింప్ట‌మ్స్ పంపుతుంద‌ని అనుకుంటున్నార‌ట‌. మొత్తానికి ఈ వేడుక‌ల‌పై ఎలాంటి స‌మాచారం లేక పోవ‌డంతో.. వైసీపీ నేత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న పడుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి. కొస‌మెరుపు ఏంటంటే.. సీఎం జ‌గ‌న్ ఆ రోజు తాడేప‌ల్లిలో ఉండ‌డం లేదు. అధికారిక ప‌ర్య‌ట‌న నిమిత్తం.. ఆయ‌న‌ప‌శ్చిమ గోదావ‌రి కి వెళ్తున్నారు.
Tags:    

Similar News