ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 9,996 కేసులు, 82 మంది మృతి !

Update: 2020-08-13 11:30 GMT
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకి గత రికార్డ్స్ బద్దలు కొడుతూ కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 9,996 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 82 కరోనా మరణాలు సంభవించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. తాజగా కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,64,142కి చేరింది. అలాగే, ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,378కి పెరిగింది. ఇక రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు కరోనా నుంచి 1,70,924 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 90,840 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 55,692 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఇక జిల్లాల వారీగా నమోదు అయిన కరోనా కేసుల్ని ఒకసారి చూస్తే.. అనంతపురంలో 856, చిత్తూరులో 963, తూర్పు గోదావరిలో 1504, గుంటూరులో 595, కడపలో 784, కృష్ణాలో 330, కర్నూలులో 823, నెల్లూరులో 682, ప్రకాశంలో 681, శ్రీకాకుళంలో 425, విశాఖలో 931, విజయనగరంలో 569, పశ్చిమ గోదావరిలో 853 కేసులు నమోదయ్యాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2461, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 434 కేసులు నమోదయ్యాయి.
Tags:    

Similar News