• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కాళ్ళ కింద నీళ్ళు చేరాక...

కాళ్ళ కింద నీళ్ళు చేరాక ఇమ్రాన్ నోట నిజాలు... ?

By - Tupaki Desk
Update: 2022-03-21 03:30 GMT
ఎవరికైనా ఇంతే అనుకోవాలి. అంతా బాగుంటే ఓకే ఓకేగా సీన్ ఉంటుంది. అసలు విషయాలు ఏవీ కళ్లకు కనబడవు. తాము తలచిందే నిజమని భ్రమల్లో ఉంటారు. పాకిస్థాన్ ఏలికలకు అది ఏమాత్రం కొత్త కూడా కాదు, అయితే అధికార మైకాలు దిగిపోతున్న వేళ తమ వారు అనుకున్న వారు పరవారు అని తేలిపోయాక మాత్రం పొరలు బాగానే  వీడిపోతాయి. నిజాలు నోట్లో తన్నుకు వచ్చేస్తాయి.

ఇపుడు సరిగ్గా అదే పరిస్థితి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ది. ఈ మాజీ క్రికెట్ ఆటగాడి రాజకీయ ఇన్నింగ్స్ కంప్లీట్ అయిపోతున్న సన్నివేశం కళ్ల ముందే ఉంది. తెర వెనక తోలుబొమ్మలాట ఆడించే పాక్ సైన్యం చెక్ చెప్పేస్తోంది. అది గ్రహించిన ఆయన పార్టీ ఎంపీలే తలాఖ్ అనేస్తున్నారు.

దాంతో బలం మొత్తం వీగిపోగా ఇమ్రాక్ పాక్  సైన్యం మీద ఆగ్రహం తో ఊగిపోతున్నారు. పాక్ సైన్యం పాలనలో వేలు పెడుతోందని, పెత్తనం చేస్తోంది అని మండుతున్నారు. పనిలో పనిగా భారత్ ని కూడా తెగ మెచ్చేసుకుంటున్నారు. భారత్ విదేశాంగ విధానం భేష్ అని కూడా కితాబులు ఇస్తున్నారు. అక్కడ సైన్యం చాలా మంచిది. తమ పౌరుల కోసం ఎంతకైనా తెగించే సైన్యం భారత్ సొంతం. అదే టైం లో రాజకీయాల్లో వారు జోక్యం చేసుకోరు అని పొగుడుతున్నారు.

కొద్ది రోజుల్లో మాజీ అవుతున్న ఇమ్రా ఖాన్ కి ఇపుడు అసలు వాస్తవాలు తెలుస్తున్నాయా అని భారత్ లోని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సైన్యం వద్దు పొమ్మంటే అక్కడ ప్రధాని ఇంటికే. అలా మాజీ ప్రధాని గా ట్యాగ్ తో ఇమ్రన్ ఖాన్ త్వరలో గద్దె దిగబోతున్నారు. దాంతో ఆయనకు భారత్ మీద ప్రేమాభిమానాలు పొంగిపొరలుతున్నాయి.

ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే ఇమ్రాన్ ఖాన్ ప్రధాని గా ఉన్న నాలుగేళ్ల కాలంలో నూ అంతకు ముందు కూడా భారత్ ఇలాగే గొప్పగానే ఉంది. కానీ ఆ సత్యం ఇమ్రాన్ కి తెలియడానికి ఇంతకాలం పట్టిందనే సెటైర్లు పడుతున్నాయి.
Tags:    
  • pakistan prime minister 
  • imran khan 
  • Latest News 
  • Tupaki Updates 
  • Telugu News 

Similar News

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS