చైనాలో వారిద్దరి మీద నోరు జారితే అంతేనట

Update: 2016-05-04 06:45 GMT
రాజకీయాల్లో విమర్శలు.. ప్రతి విమర్శలు మామూలే. పంచాయితీ మెంబర్ మొదలుకొని దేశ ప్రధాని వరకూ ఎవరినైనా అదే పనిగా విమర్శలు చేయటం మన దేశంలో చాలా కామన్. కొందరు గల్లీ నేతలు సైతం ముఖ్యమంత్రులు.. దేశ ప్రధానులపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేయటం.. కొన్ని సందర్భాల్లో వాటిని మీడియా హైలెట్ చేయటం కనిపిస్తుంది. ఇక.. కొద్దికాలంగా మొదలైన దూకుడు రాజకీయాలతో మాట జారటం ఇప్పుడు మామూలైంది.

మనదేశంలో నడిచిపోతుంది కానీ.. ఇలాంటి వైఖరి చైనాలో అస్సలు నడవదట. ఆ దేశ అధ్యక్షుడు.. ప్రధాని విషయంలో ఎవరైనా విమర్శలు చేస్తే తాట తీసేంత పని చేస్తారట. విమర్శలకు జైలుశిక్ష తప్పదని చెబుతుంటారు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకున్నట్లు హాంకాంగ్ నుంచి వెలువడే ఒక చైనా మీడియా సంస్థ పేర్కొంది.

చైనా డోనాల్డ్ ట్రంప్ గా పిలుచుకునే చైనాప్రముఖ వ్యాపారి రెన్ జికియాంగ్ అనే వ్యాపారి.. చైనా అధ్యక్షుడు జింపింగ్ పై తీవ్ర విమర్శలు చేశారట. అంతే.. ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టు ఎదుట హాజరుపర్చటం.. దేశ అధ్యక్షులు.. ప్రధాని పట్ల విదేయతతో వ్యవహరించిన సదరు వ్యాపారవేత్తకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పుచెప్పిందట. మరి.. చైనాలో అనుసరించే ఈ విధానాలు అధికారపక్షంలో ఉన్న మన అధినేతలకు తెలుసో? లేదో..?
Tags:    

Similar News