కేసీఆర్ మీద దారుణ వ్యాఖ్యలు..అదుపులోకి తీసుకొని రిమాండ్ కు..?

Update: 2020-08-18 04:15 GMT
దేనికైనా ఒక హద్దు ఉంటుంది. కానీ.. హద్దులన్నింటిని దాటేసిన ఈ ఉదంతంలో బరి తెగించిన అతడు ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు. సౌదీలో చక్కటి ఉద్యోగం చేస్తున్న అతగాడు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయటమే కాదు.. అసత్యాలతో దారుణమైన పోస్టులు పెట్టారు. ఒక పోస్టులో అయితే.. ఏకంగా కేసీఆర్ కు ముక్కు ద్వారా కరోనా సోకిందని.. ఆయన మరణించారంటూ దారుణ వ్యాఖ్యలకు తెగబడ్డాడు.

ఆయన మరణానని గాంధీ వైద్యులు ధ్రువీకరించారని ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టి ప్రచారం చేశారు. ఈ స్థాయి ఆరాచకంగా పోస్టు పెట్టిన అతడ్నిజగిత్యాల జిల్లా మల్యాల మండలం.. లంబాడిపల్లికి చెందిన 27 ఏళ్ల పన్యాల రాజుగా గుర్తించారు. అతగాడు పెట్టిన పోస్టులో ముఖ్యమంత్రి ఫోటోను మార్ఫింగ్ చేసిన వైనాన్ని గుర్తించారు. దీంతొ., సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు.. అతగాడి గురించి వివరాలు సేకరించటం షురూ చేశారు.
నిందితుడు రాజు.. దుబాయ్ లో ఉండి ఇలాంటి దారుణ ప్రచారానికి తెగబడుతున్నట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో రాజుపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే.. ఇదేమీ తెలీని అతడు ఈ నెల 14న సౌదీ అరేబియా నుంచి ముంబయికి చేరుకున్నాడు. అతడు ముంబయి ఎయిర్ పోర్టులోకి చేరుకున్నంతనే.. అక్కడి అధికారులు హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే.. అతడ్ని అదుపులోకి తీసుకోవాలని తెలంగాణ పోలీసుల ఆదేశాల్ని ముంబయిలోని ఎయిర్ పోర్టు అధికారులు పాటించారు. అతడ్ని అదుపులోకి తీసుకోవటంతో పాటు.. మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని హైదరాబాద్ కు తరలించారు. నిందితుడ్ని సోమవారం కోర్టుకు హాజరు పరిచి.. రిమాండ్ కు తరలించారు. విధాన పరంగా కొందరు నచ్చక పోవచ్చు.. అలా అని.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందన్నది మర్చిపోకూడదు.
Tags:    

Similar News