మరీ ఇంత దుష్ప్రచారమా ?

Update: 2021-07-14 04:34 GMT
ప్రతిపక్షాలు పనిగట్టుకుని మరీ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై దుష్ర్పచారం చేస్తున్నాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయసును తగ్గించేందుకు ప్రభుత్వం డిసైడ్ అయ్యిందనే ప్రచారం పదే పదే జరుగుతోంది. నిజానికి ఇలాంటి ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదు. అయినా సరే పదవీ విరమణ వయసును 60 నుండి 57కు తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, అవకాశాలను పరిశీలిస్తోందని సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలనే బురద చల్లేస్తున్నట్లు ఉద్యోగ సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు.

నిజానికి ఉద్యోగుల విరమణను 58 నుండి 60 ఏళ్ళకు చంద్రబాబునాయుడు పెంచారు. ఉద్యోగుల నుండి ఎలాంటి డిమాండ్లు కానీ ప్రతిపాదనలు కానీ ప్రభుత్వానికి రాకుండానే చంద్రబాబు విరమణ వయసును పెంచారు. విరమణ పరిమితి పెంచటం లాభదాయకమే కాబట్టి ఉద్యోగులు కూడా హ్యాపీగా ఫీలయ్యారు. చంద్రబాబు ఎందుకు విరమణ వయసును పెంచారంటే అప్పటి ఆర్ధిక పరిస్ధితుల కారణంగా పెంచారు.

2015లో ఒకేసారి రిటైర్ అయిన వందలాదిమంది ఉద్యోగులకు వేలాది కోట్ల రూపాయలు చెల్లించాల్సొచ్చింది. ప్రభుత్వం దగ్గర అంత డబ్బులేదు. దాంతో విరమణ వయసును పెంచేశారు. ఇపుడు విరమణ వయసును జగన్ తగ్గించేయబోతుబోన్నారంటూ సోషల్ మీడియాలో పదే పదే ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించినా ప్రచారం మాత్రం తగ్గలేదు. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురద చల్లేస్తున్నట్లు అర్ధమవుతోందని వెంకట్రామరెడ్డి ఆరోపించారు.
Read more!

నిజంగా విరమణ వయసును తగ్గించే ఆలోచనుంటే ముందు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చించకుండానే ఉంటుందా ? మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చిస్తుంది కదా. ఆర్ధికశాఖ దీనిపై కసరత్తులు చేస్తుంది. ఇలాంటి కసరత్తు మొదలైతే ఉద్యోగసంఘాల నేతలకు తెలీకుండానే ఉంటుందా ? అసలు ప్రభుత్వ పరిశీలనలోనే లేని ఓ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుందని ప్రచారం జరగటమంటే ఏమిటర్ధం ?

పథకాలపై కూడా ఇదే పంథా

జగన్ ఇస్తున్న సంక్షేమ  పథకాల విషయంలోను ప్రతిపక్షాలు ఇదేవిధంగా ప్రవర్తిస్తున్నాయి. ఉదయాన్నే పింఛను ఇస్తే అంత ఉదయాన్నే ఇవ్వాల్సిన అవసరం ఏముందని కామెడీ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఒక సెంటున్నర ఏం చేసుకోవాలి అంటున్నారు. అసలు ఇపుడు ఒక గజం కొనే పరిస్థితి లేని సమయంలో 60 గజాలకు పైగా ఉచితంగా ఇవ్వడం మాటలా? అపార్ట్ మెంట్ల కొంటే సొంత ప్రిమైసిస్ అనేది పేదలకు ఎప్పటికైనా ఒక కల. అదంతా పక్కన పెట్టి కేవలం నెగిటివ్ ప్రచారం చేయాలని చేస్తున్నారు.
Tags:    

Similar News