ప్రధానిపై విపక్షాల ఆగ్రహం.. జీవితాలే ఆరిపోతున్నాయని ఆందోళన
మీడియా ముందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తున్నారనే వార్తలు వెలువడితే చాలు ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గతంలో ఒకసారి మీడియా ముందుకు వచ్చిన ప్రధాని మోదీ నోట్ల రద్దు ప్రకటించారు. ఆ తర్వాత పలు విషయాల్లో ఇలాంటి కీలక నిర్ణయాలు నేరుగా ప్రజల ముందుకు వచ్చి చెబుతున్నారు. గతనెలలో కూడా నరేంద్ర మోదీ ప్రజల ముందుకు వచ్చి హఠాత్తుగా లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈసారి మీడియా ముందుకు రాకుండా ఓ వీడియో వదలగా ఆ వీడియోలో ప్రజలకు ఓ పిలుపునిస్తూ ఉంది. ఈనెల 5వ తేదీ ఆదివారం రాత్రి 9గంటలకు తొమ్మిది నిమిషాల పాటు విద్యుద్దీపాలు బంద్ చేసి టార్చ్‌లైట్లు, దీపాలు వెలిగించి మరోసారి మన ఐక్యత చాటాలని.. కరోనా అనే అంధకారం పారదోలాలని పిలుపునిచ్చారు. మరికొన్ని రోజులు మీ విలువైన సమయాన్ని తనకు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో ప్రజలకు ఏదైనా శుభవార్త చెబుతారని అందరూ భావించగా దానికి విరుద్ధంగా లైట్లు ఆర్పండి.. దీపాలు వెలిగించండి అని పిలుపునివ్వడంతో నిరాశ చెందారు.
అయితే ప్రధానమంత్రి వీడియో సందేశంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరును ఎండగట్టారు. లాక్‌డౌన్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వారికి సహాయం అందించడానికి కృషి చేయకుండా దీపాలు వెలిగించండి అని పిలుపునివ్వడంతో కాంగ్రెస్ నాయకులు కేంద్ర మాజీ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు చిదంబరం, శశిథరూర్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్ నాయకులు తప్పుబట్టారు. ప్రధానమంత్రి తీరును ఎండగట్టారు. ప్రధాన సమస్యలు వదిలేసి విచిత్రమైన పిలుపునివ్వడం సరికాదని ఖండించారు. లాక్‌డౌన్‌తో పేదలు అవస్థలు పడుతున్నారని.. ఉపాధి కోల్పోయి ప్రజలు పస్తులు ఉంటున్నారని.. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని దానికి చర్యలు తీసుకోవాల్సిన ప్రధానమంత్రి ఇలాంటి సూచనలు చేయడం సరికాదన్నారు.
స్త్రీ, పురుషులు కష్టపడి పని చేసినా అంతంతే ఆదాయం ఉంటున్న పరిస్థితిలో లాక్‌డౌన్ విధించడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని కేంద్ర మాజీమంత్రి చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. వారి కోసం.. దేశ ఆర్థిక వ్యవస్థ కోసం కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ట్విటర్‌లో కోరారు. ఇక కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా కూడా ప్రధానమంత్రి వీడియోపై ట్విట్టర్‌లో స్పందించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో భారతదేశ ప్రజలకు భరోసా కల్పించే నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా ట్విటర్ ద్వారా ప్రధానమంత్రిని కోరారు. లాక్‌డౌన్ పరిస్థితుల్లో జీడీపీ పూర్తిగా తగ్గిందని.. ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని తెలిపి వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అసలు సమస్యలను వదిలేసి దీపాలను వెలిగించడం అనే సలహాలు, సూచనలు ఇవ్వడం వృథా ప్రయాస అని పేర్కొన్నారు. పేదల బతుకులే ఆరిపోతున్న సమయాన ప్రధానమంత్రి లైట్లు ఆర్పేసి దీపాలు వెలిగించాలని పిలుపునివ్వడం సరికాదన్నారు. పేదలకు మీరు కొన్ని సహాయ చర్యలు చేపట్టి మీరు నిజంగా వెలుగులు నింపాలని కోరారు.