రోజుకు 45 నిమిషాలేనా? ఇలా అయితే ప్రైవేటుతో పోటీ ఎలా సారూ?

Update: 2020-08-26 08:15 GMT
అసలే ఆలస్యం. ఆపై తీసుకుంటున్న నిర్ణయాలు ఆశ్చర్యానికి రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు.. కార్పొరేట్ స్కూళ్లు వేసవి సెలవుల నుంచే ఆన్ లైన్ కాస్లు షురూ చేయటమే కాదు.. స్కూల్ టైంటేబుల్ కు ఏ మాత్రం తగ్గని రీతిలో భారీ ఎత్తున క్లాసులు.. మంత్లీ ఎగ్జామ్స్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రైవేటుతో పోలిస్తే కార్పొరేట్ స్కూళ్లలో రుద్దుడు మరింత ఎక్కువగా ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. సర్కారీ స్కూళ్లలో ఆన్ లైన్ క్లాసుల ఊసే లేదు. అనధికార విద్యా సంవత్సరం ఆరంభమై మూడు నెలల వరకు అవుతుందని చెబుతున్నారు. ప్రైవేటు జోరు ఈ స్థాయిలో జరుగుతుంటే.. సర్కారీ స్కూళ్లలో చదివే విద్యార్థులకు బోదన ఎలా అన్న అవిషయంపై తాజాగా నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఒకటి నుంచి పన్నెండో తరగతి విద్యార్తులకు వారంలో ఐదు రోజులు మాత్రమే ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో ప్రభుత్వ.. ప్రైవేటు పాఠశాలల్లో ఆన్ లైన్ తరగతులపై విద్యాశాఖ విధివిధానాల్ని ప్రకటన చేసింది. కామెడీ ఏమిటంటే.. ఇప్పటికే ప్రభుత్వ విధానాలకు భిన్నంగా ప్రైవేటు పాఠశాలల్ని నిర్వహిస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా నిబంధనల్ని తీసుకురావటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న మాట వినిపిస్తోంది. ఎల్ కేజీ.. యూకేజీ విద్యార్థులకు రోజుకు గరిష్ఠంగా ముప్పావు గంట.. వారంలో మూడు రోజులు మాత్రమే ఆన్ లైన్ పాఠాలు బోధించాలని ప్రభుత్వం పేర్కొంది.

రోజుకు ముప్పావు గంట.. అది కూడా వారానికి మూడు రోజులే అంటే.. వర్క్ వుట్ కాదన్న మాట ప్రైవేటు.. కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఇంత తక్కువ వ్యవధికి పాఠాలు చెప్పటం ద్వారా.. పిల్లలకు కలిగే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నతో పాటు.. ఈ మాత్రం దానికి వేలాది రూపాయిలు ఫీజులు ఎందుకు చెల్లించాలన్న ప్రశ్న తలెత్తుతుందని చెబుతున్నారు.

అందుకే.. ప్రభుత్వ నిర్ణయంతో పని లేకుండా.. కనీసం మూడు.. నాలుగు గంటల పాటు పాఠాలు చెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు. నర్సరీకి మినహాయింపు ఉందంటున్నారు. ఇలా.. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వేళ.. ప్రైవేటు విద్య ఒకతీరులో.. ప్రభుత్వ విద్య మరో తరులో ఉండటం ఖాయమంటున్నారు. దీని కారణంగా సర్కారీ స్కూళ్లలో చదివే వారు మరింత నష్టపోవటం పక్కా అంటున్నారు. సర్కారీ స్కూళ్లలో చదివే వారికి టీవీలు.. రేడియోలు లేని పక్షంలో పంచాయితీ కార్యాలయాల సాయం తీసుకోవాలంటున్నారు. కాగితాల మీద విధివిధానాలు బాగానే ఉన్నా.. ప్రాక్టికల్ గా మాత్రం అంత సులువు కాదన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News