• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పవన్ పై సంచలన కామెంట్స్...

పవన్ పై సంచలన కామెంట్స్ చేసిన పవనిజం సృష్టికర్త

By - Tupaki Desk
Update: 2019-12-14 06:03 GMT
పవన్ కళ్యాణ్.. తెర ముందు మాత్రమే.. ఆయన ఆత్మ అంతా రాజు రవితేజ. పవన్ కు అత్యంత సన్నిహితుడు ఈయన. ఈయన ఆలోచనల్లోంచే పవన్ పాలిటిక్స్ లోకి వచ్చాడన్న ప్రచారం ఉంది. పవన్ గురించి మొత్తం తెలిసిన రాజు రవితేజ ఆ మధ్య రాసిన ‘పవనిజం’ పుస్తకం వైరల్ అయ్యింది. అప్పటి నుంచే పవనిజం మాట ప్రచారంలోకి వచ్చింది. అంతటి దగ్గరి నుంచి చూసి సన్నిహితుడైన రాజు రవితేజ తాజాగా జనసేనకు రాజీనామా చేశారు. జనసేన పార్టీ పోలిట్ బ్యూరో పదవికి స్వస్తి చెప్పారు. ఈ పరిణామం జనసేన పార్టీకి , పవన్ కు షాక్ తగిలినట్టైంది.

అయితే రాజు రవితేజ జనసేనకు రాజీనామా చేస్తూ సంచలన లేఖ రాశారు. పవన్ పై దారుణ కామెంట్స్ చేశారు.  ఆ లేఖ ఇప్పుడు దుమారం రేపుతోంది.

పవన్ ఒకప్పుడు మంచి మనిషి అని ఇప్పుడు మాత్రం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని రాజురవితేజ లేఖలో ఆరోపించారు. పవన్ వ్యవహారశైలి నచ్చకే రాజీనామా చేస్తున్నట్టు చెప్పాడు. పవన్ ఒక ప్రమాదకర విభజనకారి అంటూ సంచలన కామెంట్ చేశారు.

జనసేన పుట్టుకలో తాను కీలకపాత్ర పోషించానని.. జనసేన మొదటి ప్రధాన కార్యదర్శిని నేనేనని.. ప్రస్తుతం పొలిట్ బ్యూరో సభ్యుడినని పవన్ వైఖరి నచ్చక వైదొలుగుతున్నట్టు రాజురవితేజ చెప్పుకొచ్చాడు. పవన్ కక్షససాధింపుతనం, కుల, మత పరమైన ద్వేషంతో నడిచే ప్రమాదకరమైన విభజన శక్తిగా మారిపోయారని సంచలన కామెంట్స్ చేశారు.  రాజకీయ, సామాజిక శక్తి గల పదవిని పొందడానికి పవన్ అనర్హుడు అంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్ అధికారానికి అనర్హుడు అంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. పవన్ కళ్యాణ్ సమాజానికి ప్రమాదకరం అంటూ ముగించారు.
Tags:    
  • Janasena 
  • Andhra News 
  • Andhra Daily News 
  • Telugu News 
  • Pawan Kalyan 
  • Telugu Daily News 
  • Andhra Politics 
  • Jana Sena Party 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

Copyright @2026

Powered by Blink CMS