• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆ ఊరిలో ఒక్కమగాడు...

ఆ ఊరిలో ఒక్కమగాడు ..ఎందుకంటే ?

By - Tupaki Desk
Update: 2019-11-05 06:40 GMT
సాధారణంగా పల్లెటూరు అంటే పచ్చని చెట్లు , పచ్చని పైర్లు , చుట్టూ బంధువులు , ఊరి నిండా అయినవారు ..ఊరంతా మనవారే అనుకునే మనుషులు. అందుకే అందరూ పల్లెటూరు అంటే అంత ప్రాణమిస్తారు. కానీ , ప్రస్తుత రోజుల్లో సంపాదన కోసం పట్టణాలలో నివసిస్తున్నా కూడా ఏ పండుగ వచ్చిన ప్రతి ఒక్కరి మనసు పల్లెటూరి వైపే చూస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ , ఆంధ్రప్రదేశ్ లోని ఒక గ్రామం మాత్రం నిర్మానుష్యంగా మారింది. పక్కనే మైలవరం డ్యామ్, కూతవేటు దూరంలో మండల కేంద్రం. మరికొద్ది దూరంలో నియోజకవర్గ కేంద్రమైన జమ్మలమడుగు  .. సకల సౌకర్యాలు ఉన్నా కూడా ఆ ఊరి ఖాళీ అయిపోయింది. దీనికి ప్రధాన కారణం ..గతంలో అక్కడ జరిగిన ఒక హత్య.

ఆ హత్య తో నిత్యం నవ్వులతో , పిల్లల అట , పాటలతో కళకళలాడే ఆ ఊరు మొత్తం ఖాళీగా మారిపోయింది. గత నాలుగేళ్లుగా ఆ ఊరి అలాగే నిశబ్ధంగా ఉంది. అలాంటి ఆ ఊరిలో ఒక వృద్ధుడు మాత్రమే జీవనం కొనసాగిస్తున్నాడు. ఏడాది క్రితం వరకు ఆయనకి తోడుగా అయన భార్య ఉండేది. ఆమె కూడా కాలం చేయడంతో ఆ ఊరిలో ప్రస్తుతం అయన ఒక్కడే నివాసం ఉంటున్నాడు. ఆ ఊరి పేరు దప్పెర్ల .. జమ్మలమడుగు మండలం , పొన్నతోట పంచాయితీ.

వివరాలని చూస్తే .. గత కొన్ని రోజుల ముందు వరకు 40 ఇళ్ళు , 200 మందికి పైగా జనాభా , పచ్చని పైర్లతో దప్పెర్ల కళకళలాడేది. కానీ , 1991 లో పొలం తగాదా కారణంగా   దేవ సహాయం అనే విశ్రాంత ఉపాద్యాయుడు హత్యకి గురైయ్యారు. ఇక ఆ నాటి నుండి ప్రతి రోజు విచారణ కోసం అని పోలీసులు రావడం మొదలుపెట్టారు. దీనితో ప్రతి రోజు వచ్చే పోలీసులకి సమాధానం చెప్పలేక ఒక్కొకరుగా ఆ గ్రామాన్ని వదిలి వెళ్లిపోవడం మొదలుపెట్టారు. దీనితో కొన్ని రోజుల్లోనే ఒక్క శేషం దానం కుటుంబం తప్ప ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. దీనితో ఆ ఊర్లో ఉన్న స్కూల్ ని కూడా మరోచోటికి మార్చడంతో దానం ముగ్గురు కుమారులు కూడా ..తమ పిల్లల స్కూల్ కోసం ఊరిని వదిలి వెళ్లారు. కానీ , ఆ వృద్ధ దంపతులు మాత్రం కన్నతల్లి లాంటి ఆ గ్రామాన్ని వదిలివెళ్లలేక పోయారు. గత ఏడాది డిసెంబర్ 19  న అయన భార్య కూడా మృతి చెందింది. దీనితో అప్పటినుండి ఒక్కడే జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రతి నెలా పక్క ఊరిలోకి వెళ్లి రేషన్ తెచ్చుకొని , ప్రభుత్వం ఇచ్చే పింఛన్ డబ్బుతో బ్రతుకుతున్నాడు. ఎంతోమంది అయనని ఆ ఊరు వదిలి రావాలి అని చెప్పినా కూడా నేను ఇక్కడే పుట్టా ..నేను చచ్చే వరకు ఈ గ్రామాన్ని వదిలిపోను అని తెలిపినట్టు స్థానికులు చెప్తున్నారు.
Tags:    
  • Wife Death In Village 
  • One And Only Hero 
  • December 19th Incident 
  • Tupaki News 

Similar News

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

Copyright @2026

Powered by Blink CMS