తెలంగాణలో బార్లు.. క్లబ్బులకు ఓకే.. కండీషన్స్ అప్లై
కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ లో అన్ని రకాల వాణిజ్య కార్యకలాపాలపైనా పరిమితులు విధించటం తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నా.. మారిన పరిస్థితులకు తగ్గట్లుగా ఇప్పటివరకు నిలిపేసిన పలు వాణిజ్య కార్యకలాపాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపేస్తుంది. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బార్లు.. క్లబ్బుల్ని తక్షణమే ఓపెన్ చేయాలని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని జారీ చేశారు.
తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని అన్ని బార్లు.. కబ్బులు.. టూరిజం క్లబ్బుల్ని తక్షణమే తెరిచే వీలుంది. అయితే.. మ్యూజికల్ ఈవెంట్లు.. డ్యన్స్ ఫ్లోర్లపై మాత్రం బ్యాన్ కంటిన్యూ అవుతోంది. పబ్బులకు అనుమతి ఇవ్వలేదు. వైన్ షాపులు ఓపెన్ చేసేందుకు ఓకే చెప్పినా.. వాటి వద్ద ఏర్పాటు చేసే పర్మిట్ రూంలపై మాత్రం బ్యాన్ కొనసాగనుంది. తాజాగా విడుదల చేసిన నిబంధనల ప్రకారం క్లబ్బులు.. బార్లు పరిమితుల మేర మాత్రమే నడిపే వీలుంది.
బార్లకు వచ్చే వారిని తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలి. అయితే.. టచ్ చేయని రీతిలో థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. బార్లు.. కబ్బుల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయటం.. నిబంధనలకు అనుగుణంగా క్యూ విధానాన్ని అమలు చేయాలి. పార్కింగ్ ప్రదేశాల్లో ఎక్కువమంది గుమిగూడి ఉండకూడదు.
హ్యాండ్ శానిటైజర్ ను అందుబాటులో ఉంచటంతో పాటు.. బార్ సిబ్బంది కచ్ఛితంగా మాస్కులు ధరించాల్సిందే. నిత్యం రెండు పూటల బార్ ప్రాంగణాన్ని పూర్తిస్థాయిలో శుభ్రం చేయటంతో పాటు.. కస్టమర్లు మారే ప్రతి సందర్భంలోనూ వారు కూర్చునే సీట్లను శానిటైజ్ చేయటం తప్పనిసరి. బార్లు.. కబ్బులు చీకట్లో ఉండకూడదు. గాలి.. వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.