చనిపోయిన జవాన్ నుంచి భార్యకు ఫోన్ కాల్!

Update: 2020-06-18 11:50 GMT
భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి దేశంలో విషాదం నింపింది. వీరజవాన్ల వివరాలను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. వారి కుటుంబాలకు స్వయంగా సమాచారం అందించింది.

అయితే తాజాగా అమరుడైన వ్యక్తి నుంచి కుటుంబ సభ్యులకు ‘నేను బ్రతికే ఉన్నా’ అంటూ ఫోన్ కాల్ రావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ అరుదైన సంఘటన బీహార్ లో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

భారత్-చైనా సరిహద్దుల్లో సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో భారత జవాన్లు 20 మంది వీరమరణం పొందారు. చైనాకు చెందిన 43 మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బీహార్ కు చెందిన సునీల్ కుమార్ కూడా వీరమరణం పొందాడు.

అయితే అతడికి బదులుగా ఆర్మీలో పనిచేస్తున్న సునిల్ రాయ్ కుటుంబానికి అధికారులు పొరపాటున సమాచారం పంపారు. దీంతో సునిల్ రాయ్ కుటుంబం కన్నీటిపర్యంతమైంది. ఆ గ్రామంలో అంతా విషాధచాయలు అలుముకున్నాయి. అందరూ వచ్చి పరామర్శించారు.

అయితే మీడియా ద్వారా తెలుసుకున్న అమరుడైన జవాన్ సునిల్ రాయ్ నుంచి వెంటనే కుటుంబానికి ఫోన్ కాల్ రావడంతో ఆ కుటుంబం సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ గందరగోళానికి కారణం బీహార్ రెజిమెంట్ కు చెందిన ఇద్దరు జవాన్ల పేర్లు ఒకటే కావడం. వారి తండ్రి పేర్లు కూడా ఒకటే. సునీల్ కుమార్ కు బదులు సునీల్ రాయ్ అనే వ్యక్తి కుటుంబానికి సమాచారం పంపడంతో ఈ పొరపాటు జరిగింది.
Tags:    

Similar News