• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కాళ్ల బేరానికి వస్తున్న...

కాళ్ల బేరానికి వస్తున్న ఎన్నారై అల్లుళ్లు

By - Tupaki Desk
Update: 2020-03-13 01:30 GMT
వరకట్నం, వేధింపుల కేసుల్లో వాంటెడ్ గా ఉన్న ‘ఎన్నారై అల్లుళ్లకు’ పోలీసులు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. భార్యలను వేధింపులకు గురిచేసి ఎంచక్కా విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ఎన్నారై అల్లుళ్ల ఆటలు సాగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి కేసుల్లో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌(ఎన్‌బీడబ్ల్యూ) జారీ అయితే వారి పాస్‌పోర్ట్స్‌ రద్దు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రీజినల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయాలకు(ఆర్పీఓ) లేఖలు రాయడం ద్వారా వాంటెడ్‌ అల్లుళ్ల ఆటలను కట్టిస్తున్నారు.

అదనపు కట్నం కోసం వేధింపులపై ఎన్నారై అల్లుళ్లకు సంబంధించిన నిత్యం అనేక కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా సిటీ లో ఉండే బాధితులు మహిళా ఠాణాలకు క్యూ కడుతుంటారు. ముఖ్యంగా ఎన్నైరై భర్తలు వివాహం చేసుకుని తీసుకెళ్లట్లేదని.. అక్కడకు వెళ్లాక కట్నం కోసం మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని.. లేని అర్హతలు చెప్పి మోసం చేశాడని బాధితులు ఆరోపిస్తుంటారు. వీటిపై కేసులు నమోదు చేసుకుంటున్న పోలీసులు ఎన్నారైలను అరెస్టు చేసేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

భారత్‌ లో మాదిరిగా అన్ని దేశాల్లోనూ వరకట్న వేధింపులు అనేది తీవ్రమైన నేరం కాదు. దీంతో ఇంటర్‌పోల్‌ ఎన్నారైలకు రెడ్‌ కార్నర్‌ నోటీసులకు బదులుగా బ్లూ కార్నర్‌ నోటీసులు జారీ చేస్తుంది. ఇది కేవలం నిందితులకు సంబంధించిన ఆచూకీ తెలిపేందుకే మాత్రమే ఉపయోగపడుతుంది. ఇదంతా సుదీర్ఘ ప్రక్రియ. ఇది వాంటెడ్‌ ఎన్నారైలకు అనుకూలంగా మారింది.

ఇటీవల కాలంలో పోలీసులు వాంటెడ్‌గా ఉన్న ఎన్‌ఆర్‌ఐ అల్లుళ్లపై లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌(ఎల్‌ఓసీ) జారీ చేస్తున్నారు. దీనిని దేశంలోని అన్ని విమానాశ్రయాలకు పంపిస్తారు. ఎల్‌ఓసీ జారైన వ్యక్తి వ్యక్తిగత, కేసు వివరాలు, పాస్‌పోర్ట్‌ నంబర్లను విమానాశ్రయాల్లో ఉండే డేటాబేస్‌లో నిక్షిప్తం చేస్తారు. ప్యాసింజర్ ఇమ్మిగ్రేషన్‌ తనిఖీల్లో వాంటెడ్‌ అని వెలుగులోకి తేలితే అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం ఇస్తారు. సంబంధిత పోలీసులు అక్కడి చేరుకొని నిందితుడిని తీసుకువెళ్లే వరకు ఎయిర్‌పోర్ట్‌ దాటకుండా తమ అధీనంలోనే ఉంచుకుంటారు. అలాగే పాస్ పోర్టు చట్టం ప్రకారం న్యాయస్థానాలకు వాంటెడ్‌గా ఉండి, విదేశాల్లో తలదాచుకున్న వ్యక్తి పాస్‌పోర్ట్‌ను రద్దు చేయించే అధికారం పోలీసులకు ఉందని సమాచారం.

అదే జరిగితే సదరు వ్యక్తి ఉద్యోగం కోల్పోవడంతోపాటు స్వదేశానికి డిపోర్ట్‌ కావడం, తిరిగి విదేశాలకు వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నారైలు కాళ్లబేరాలకు వస్తున్నారు. భార్యల తో రాజీలు చేసుకోవడమో, కోర్టులకు హాజరై ఎన్‌బీడబ్ల్యూలు రీకాల్‌ చేయించుకోవడమో చేస్తున్నారని సీసీఎస్‌ పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే 40మందిపై ఈ చర్యలు తీసుకున్నారు. ఇనాళ్లు భార్యలను వేధింపులకు గురిచేసి తప్పించుకు తిరుగుతున్న ఎన్నారై అల్లుళ్లు ఇక తప్పించుకోవడం సాధ్యం కాకపోవడం తో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    
  • Political News 
  • Breaking News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • NRI 

Similar News

సర్పంచ్ పదవికి రూ.కోటిన్నర.. ఎకరం పొలం.. పల్లెల్లో మొదలైన సందడి

2026-11-12 11:41 GMT

సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్ : ఏపీకి రూ. 32.49 లక్షల కోట్ల పెట్టుబడులు

2026-11-12 11:34 GMT

టీవీకేలో 'అడ్వాన్స్' రాజీనామాలు.. సీఎం విజయ్ ఏంటయ్యా ఇదీ?

2026-11-12 11:30 GMT

రాజకీయాలకు అతీతంగా తెలుగుబిడ్డకు గౌరవం ఇచ్చిన చంద్రబాబు

2026-11-12 11:00 GMT

చంద్రబాబు హిట్ లిస్టులో ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు, త్వరలో నిర్ణయం

2026-11-12 10:30 GMT

సాయిరెడ్డి గాలి తీసేసిన పాల్‌!

2026-11-12 10:17 GMT

పీఆర్‌పీ చీఫ్.. ఎవ‌రీ సాయిరెడ్డి.. ఈ విష‌యాలు తెలుసా?!

2026-11-12 10:17 GMT

ట్రంప్ పట్టుకొచ్చాడు.. అతడు వచ్చాడంటే ‘హెచ్1బీ’లకు మూడినట్టే?

2026-11-12 08:16 GMT

ట్రంప్ కు షాకిచ్చిన పాకిస్తాన్.. అమెరికా వ్యూహం ఎందుకు ఫెయిలయ్యింది?

2026-11-12 08:16 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చీపురుపల్లి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. స్థానికంలో బొత్స దూకుడు

2026-11-12 06:05 GMT

బీబీసీకి ఎదురుదెబ్బ.. ట్రంప్ పరువు నష్టం కేసుకు గ్రీన్ సిగ్నల్!

2026-11-12 06:05 GMT

Copyright @2026

Powered by Blink CMS